Wednesday, January 22, 2025

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట ఆర్బన్: ప్రభుత్వ ఆసుపత్రుల లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం ఢిల్లీ నుంచి జిల్లాలలోని ఆరోగ్య సిబ్బంది, గ ర్భిణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ దవాఖానాలో ప్రసవాలు పెరగాలి. నార్మల్ డెలివరీలు ఎక్కువ గా జరగాలి. ప్రజల ఆరోగ్యం కోసం మార్పులు తెద్దామ ని ఆరోగ్య శాఖ సిబ్బందికి మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు. సర్కారు దవాఖానాలో మెరుగైన వైద్యం, స కల వసతులు ఉన్నాయని, అన్నీ రకాల వైద్యం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

మీ ఆరోగ్యం కోసం, మీకు మ ంచి వైద్యం అందాలని, మీ గర్భిణులు అందరికీ సాఫీగా ప్రసవాలు జరగాలని కోరుకుని గర్భిణీలను కూడా కలుపుకుని 4 వేల 900 మంది, వీరిలో జిల్లా వైద్య శాఖ అధికారులు, సిబ్బందితో ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలిపారు. ఆశాకార్యకర్తలు, ఏఎన్‌ఏంలు గ్రామాల వా రీగా చెకప్ నుంచి డెలివరీ అయ్యే వరకూ అమ్మఒడి వా హనంలో దవాఖానకు తీసుకెళ్ళి వైద్యునికి చూయించి మీకు అవసరమైన మందులు ఇవ్వడం జరుగుతుందని వివరించారు.
టిఫా స్కానింగ్ సేవలు వినియోగించుకోవాలి
ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉచితంగా స్కానింగ్ చేస్తారని, సిద్దిపేట, గజ్వేల్ అన్నీచోట్ల స్కానింగ్ మిషనరీలు పెట్టిన ట్లు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు వెళ్ళవద్దని, మీ డబ్బులు వృథా చేసుకోవద్దని గర్భిణులకు మంత్రి సూచించారు. ప్రతీ పరీక్ష ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా చేయడం కో సం ఏర్పాట్లు చేశామని, అమ్మ ఒడి వాహనంలో ఆశాలు తీసుకువచ్చి అవసరమైన స్కానింగ్ చేయించి తిరిగి మిమ్మల్ని మీ ఇంటి వద్ద దింపుతారని వివరించారు. కొద్ది మందికే టిఫా స్కానింగ్ అవసరం ఉంటుందని, ప్రైవేట్ ఆసుపత్రులలో టిఫా స్కానింగ్ చేసుకుంటే 3 వేలు రూ పాయలు ఖర్చు అయ్యేవి.

ఇక నుంచి ప్రభుత్వ ఆసుపత్రి లో ఉన్న ఆ టిఫా స్కానింగ్ యంత్రాలు సిద్ధిపేట, గజ్వేల్ ఆసుపత్రులలో ఏర్పాటు చేసినట్లు వాటిని అవసరమైన గర్భిణీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషనరీలు అందరికీ ఉచితంగా చేస్తారని ఈ వైద్య సేవలు మీరంతా పొందాలని కోరుతూ గర్భిణులకు సవివరంగా వివరించారు. ఎనిమియా సమస్య రక్తహీనతతో బాధపడే వారికై 180 ఐరన్ మందులు ప్ర భుత్వం నుంచి ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. క్ర మం తప్పకుండా 180 ఐరన్ మందులు వాడితే రక్త హీ నత తగ్గి బలంగా ఉంటారని చెప్పుకొచ్చారు. అంగన్ వా డీ కేంద్రాలలో పాలు, కోడిగుడ్లు, వేడివేడిగా ఆహారం పె ట్టాలని ఆదేశించినట్లు, మంచి పౌష్టికాహారం తీసుకోవాలని, తద్వారా మీరు బలంగా ఉంటారని, పుట్టబోయే బి డ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.

ఆశాకార్యకర్తలు, ఏఎన్‌ఏంలతో గ్రామాల వారీగా ప్రభుత్వ దవాఖానలో ప్రసవాలు, ప్రైవేటు ఆసుపత్రిలలో ప్రసవాలు, వాటిలో నార్మల్, సిజేరియన్ల అంశాల వారీగా చేపట్టాల్సి న లక్ష్యాలను దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రికి తేడా ఏమిటో తెలియ చేయాలని ఆరా తీశా రు. ప్రైవేటు దవాఖానకు పోతే ఖర్చులు అవుతాయని, పెద్ద ఆపరేషన్లు చేయొద్దని, తల్లి, బిడ్డల ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలని సూచిస్తూ.., గర్భిణీలకు ఆసుపత్రిలో వ్యా యామం చేయించాలని, దీంతో నార్మల్ డెలివరీలు సులభంగా చెయొచ్చుననే విధానం తీరు, పెద్ద ఆపరేషన్ల ద్వా రా జరిగే నష్టాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాల ని సూచించారు. గ్రామాల వారీగా ఆశాకార్యకర్తలు, ఏఎన్‌ఏంలు ప్రజల ప్రతీ మనిషి ఆరోగ్య స్థితిగతులైన బిపి, షుగర్ తదితర వ్యాధులు గుర్తించిన అంశాలపై ఆరా తీసి ప్రభుత్వమే ఇంటింటికీ వెళ్లి ఎన్సీడీ కిట్లు పంపిణీ చేయాలని ఆరోగ్య శాఖ సిబ్బందిని మంత్రి ఆదేశించారు.
మొదటి గంటలోబిడ్డకు తల్లిపాలు ఎంతో ముఖ్యం
మూడనమ్మకాలతో సిజేరియన్లు చేయొద్దని, నార్మల్ డెలివరీ ప్రాముఖ్యత సవివరంగా వివరించారు. గోల్డెన్ అవర్ మొదటి గంటలో బిడ్డకు తల్లిపాలు ఎంత ముఖ్యమో ప్రాముఖ్యత వివరిస్తూ.. మొదటి గంటలో బిడ్డకు తల్లిపాలు తాగించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. తెలంగాణ రాష్ట్రంలో 33 శాతం మాత్రమే తల్లిపాలు తాగిస్తున్నారని, 66 శాతం మంది పిల్లలు మొదటి తల్లిపాలు తాగలేకపోతున్నారని ఆరోగ్య మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి గంట తల్లిపాలు అమృతంతో సమానంగా భావించి పిల్లలకు పాలు పట్టించాలని, రోగ నిరోధక శక్తి కై ఇవి టీకా మాదిరిగా పని చేస్తాయని గర్భిణులను వాటి ప్రాముఖ్యత తెలుపుతూ మంత్రి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News