Thursday, April 24, 2025

మెట్రోలో బెట్టింగ్‌ యాప్‌ల ప్రకటన.. హైకోర్టులో పిల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బెట్టింగ్ యాప్‌ వాడకం ఇప్పుడు తీవ్ర సమస్యగా మారింది. ఈ బెట్టింగ్ యాప్‌లను అరికట్టేందకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంది. అయితే తాజాగా మెట్రో రైలులో బెట్టింగ్ యాప్‌ల గురించి ప్రకటన రావడంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. నాగూర్‌బాబు అనే న్యాయవాది ఈ పిల్‌ని దాఖలు చేశారు. బెట్టింగ్ యాప్‌లను ప్రభుత్వం నిషేధించినా.. మెట్రో రైలులో ప్రకటన రావడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని బెట్టింగ్ యాప్‌లపై ఇడి విచారణ కొనసాగుతోందని.. మెట్రో రైలులో ఈ ప్రకటనలపై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపారు. అయితే 2022లోనే మెట్రో రైలులో బెట్టింగ్ యాప్‌ల ప్రకటనలు నిలిపివేశామని.. మెట్రో సంస్థ తరుఫు న్యాయవాది అన్నారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని కోరారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News