Monday, December 23, 2024

బేవరేజెస్‌లో అవినీతి గబ్బు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ వ్యవహారం మొదటి నుంచి వివాదస్పదమే. దీనిపై గతంలోనే అనేక ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం కొత్త బీర్ల కంపెనీలకు అనుమతులివ్వడంతో పాటు ఆయా కంపెనీలకు చెల్లించే ధరల విషయంలో అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 11 ఏళ్ల పాటు కీలక పద విలో విధులు నిర్వర్తించిన వ్యక్తి అప్పటి ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి భారీగా మేలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పట్లో జిఎంగా పనిచేసిన ఆ వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్వచ్చందంగా తన పదవి నుంచి తప్పుకున్నట్టుగా తెలిసింది. ఆయన సంస్థను తన గుప్పిట్లో ఉంచుకున్నారని మద్యం కం పెనీల నుంచి మాముళ్లను దండుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా కం పెనీల నుంచి చెల్లించే ముడుపులతో పాటు విదేశీ పర్యటనలను అధికారులకు కల్పించి ఈయన కూడా భారీగా లబ్ధిపొందారన్న
ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తన గుట్టు బయటపడుతుందన్న భయంతోనే ఆయన తన పదవి నుంచి తప్పుకున్నారని ఆ శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు. నిజానికి ఆయన సంస్థలో విధులు నిర్వర్తించినప్పుడే ఆయన రిటైర్‌మెంట్ కాగా, అప్పటి ఎక్పైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయనను సుమారు 6 సంవత్సరాల పాటు (2024 వరకు) అదే పదవిలో ఓఎస్‌డిగా నియమించారు. మద్యం కంపెనీలను బెదిరించడంతో పాటు నెలనెలా ఆయా కంపెనీలు ఇచ్చే మాముళ్లు, విదేశీ పర్యటనలను తదితర వాటిని ఉన్నతాధికారులకు ఆశ చూపి ఆ రిటైర్డ్ అధికారి కోట్లను వెనుకేసుకున్నట్టుగా సమాచారం. ఇలా రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్‌ను తన గుప్పిట్లో పెట్టుకొని తాను ఆడిందే ఆట పాడిందే పాటగా 11 ఏళ్ల పాటు వ్యవహారించారని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మద్యం కంపెనీలు 51
ప్రస్తుతం రాష్ట్రంలో లోకల్‌గా తయారయ్యే లిక్కర్‌కు సంబంధించి 20 కంపెనీలు ఉండగా అందులో నాన్‌లోకల్ 31 ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో 51 మద్యం కంపెనీలు ఉన్నాయి. వీటితో పాటు బీరు కంపెనీలు లోకల్‌గా తయారయ్యేవి 06 కంపెనీలు ఉండగా, నాన్‌లోకల్‌వి 07 కంపెనీలు ఉన్నాయి. మొత్తంగా 13 బీరు కంపెనీలు రాష్ట్రంలో బీర్లను విక్రయిస్తున్నాయి. ఇక ఫారన్ లిక్కర్‌కు సంబంధించి 27 కంపెనీలు ఉన్నాయి. ఇలా లిక్కర్, బీరు, ఫారన్ లిక్కర్‌కు సంబంధించి మొత్తం 91 కంపెనీలు రాష్ట్రంలో మద్యం విక్రయాలను జరుపుతున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా 1,956 బ్రాండ్‌ల విక్రయం…
ఈ 91 కంపెనీలు లోకల్‌గా 385 రకాల బ్రాండ్‌లను తయారు చేస్తుండగా, నాన్‌లోకల్ కంపెనీలు 394 బ్రాండ్‌లను ఇక్కడ విక్రయిస్తున్నాయి. ఇక లోకల్ బీర్లు 50 రకాల బ్రాండ్‌లను తయారు చేస్తుండగా, నాన్‌లోకల్ 36 బ్రాండ్‌లను రాష్ట్రంలో విక్రయిస్తున్నాయి. ఇక ఫారిన్ లిక్కర్ విషయంలోనూ 1,091 నాన్‌లోకల్ బ్రాండ్‌లను ఇక్కడ విక్రయిస్తున్నాయి. ఈ విధంగా లిక్కర్, బీర్లు, ఫారిన్ లిక్కర్‌లు కలిపి రాష్ట్రవ్యాప్తంగా 1,956 లోకల్ బ్రాండ్‌లను విక్రయిస్తున్నాయి.

కింగ్ ఫిషర్‌కు రూ.289.22లు
అయితే ఈ మద్యం, బీర్లు, ఫారిన్ లిక్కర్ విక్రయాలకు సంబంధించి కమిటీ నిర్ధేశించిన ధరల ఆధారంగా వాటికి ఇక్కడ విక్రయిస్తారు. ఇలా రాష్ట్రంలో బీర్లకు రూ.100 నుంచి రూ.1000ల వరకు ధరలను కమిటీ నిర్ణయించింది. ఇంతకన్నా ఎక్కువ వాటికి ప్రభుత్వం ధరలను చెల్లించరాదని కమిటీ సూచించింది. ఒకవేళ రూ.900ల వరకు ధరను నిర్ణయించినా దానికి సహేతుకమైన కారణాలతో పాటు ఆ బ్రాండ్‌లకు ఉన్న ఆదరణ పరిగణలోకి తీసుకొని మరోసారి దానిని కమిటీతో అప్రూవల్ చేయించాలన్న నిబంధన ఉంది. ప్రస్తుతం 12 బాటిళ్ల బీరు కేసు (కొన్ని కంపెనీలకు సంబంధించి) ప్రాథమిక సగటు ధర రూ.291 ఉండగా

ఓ కంపెనీకి ఏకంగా రూ.907కు టిడిబిసిఎల్ అనుమతి ఇవ్వడంతో ప్రస్తుతం ఆ సంస్థ తీరు చర్చనీయాంశం అయ్యింది. స్థానిక బీర్ల ప్రాథమిక సగటు ధర కంటే ఏకంగా రెండు రెట్లు అధిక ధర ఖరారు చేయడంపై ఎక్సైజ్ శాఖ విచారణ చేపట్టింది. తెలంగాణలో అత్యధికంగా విక్రయాలు జరుగుతున్న కింగ్ ఫిషర్ లాగర్ 650ఎంఎల్ బీరు కేసు ప్రాథమిక ధర రూ.289.22లుగా ఉండగా, కింగ్ ఫిషర్ అల్ట్రా మాక్స్ ప్రీమియం స్ట్రాంగ్ 650ఎంఎల్ కేసు ధర రూ.443.31లుగా ఉంది. ఇలా వివిధ రకాల కంపెనీలకు చెందిన బీర్ల ప్రాథమిక ధరలు వేర్వేరుగా ఉంటాయి. అయినా కూడా ఏ బీరుకు కూడా ఇంత ఎక్కువ ప్రాథమిక ధర ఖరారు చేయలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News