Thursday, January 23, 2025

నకిలీ యాప్‌లతో జాగ్రత్త!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గూగుల్ ప్లేస్టోర్ నుండి వివిధ రకాల యాప్‌లను డౌన్‌లోడ్ చేస్తూనే ఉంటాం, యాప్‌లలో ప్రమాదకరమైనవి ఉంటాయని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ హెచ్చరిస్తోంది. ఈ సంస్థ స్పైవేర్‌ను కనుగొంది. ఇది ఫోన్ ఇమెయిల్‌ల సమాచారంతో పాటు ఫోన్ కెమెరాను ఉపయోగించి రికార్డులను కూడా దొంగిలిస్తుంది. ఈ స్పైవేర్ దేశంలోని 42 కోట్ల ఆండ్రాయిడ్ ఫోన్‌లకు వ్యాపించింది.

గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న 105 యాప్‌ల ద్వారా ఫోన్‌కి చేరిన దీని పేరు ‘స్పిన్ ఓకే’గా గుర్తించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన రహస్య సమాచారం బయటకు రాకుండా, అనుమానాస్పద యాప్‌లను వారి మొబైల్ ఫోన్‌ల నుండి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని మంత్రిత్వ శాఖల సిబ్బందిని ఆదేశించింది.

ఫోన్‌లో స్పైవేర్ ఉందో లేదో తెలుసుకోవడం ఎలా?
ఈ స్పైవేర్‌ను నివారించేందుకు వివిధ నిపుణులు కొన్ని మార్గాలను సూచించారు. కారణం లేకుండానే ఫోన్‌లో పదే పదే ప్రకటనలు వస్తూ ఉండడం మనం గమనిస్తాం. ఈ పరిస్థితిలో మీ ఫోన్‌లో స్పైవేర్ ఉండే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితిలో డౌన్‌లోడ్ చేసిన యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయడం మంచిది.

నివారించడానికి ముందుగా ఆండ్రాయిడ్ ఫోన్‌లో యాంటీవైరస్, యాంటీ స్పైవేర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. వెబ్‌సైట్ లేదా యాప్‌లో తెరిచే ప్రకటనలపై క్లిక్ చేయవద్దు. ఇ-మెయిల్ లేదా ఇతర మార్గాల నుండి వచ్చే తెలియని లింక్‌లపై క్లిక్ చేయవద్దు. గూగుల్ ప్లే స్టోర్ నుండి ఏదైనా యాప్‌ని డౌన్‌లోడ్ చేసే ముందు, దాని గురించి కామెంట్లను తెలుసుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News