బిజెపి కుట్రలను యువత గుర్తించాలి
హిందువులు, ముస్లింలు సహా అన్ని వర్గాలకు బిజెపి ఒరగబెట్టిందేమీ లేదు
మహారాష్ట్రలో ఎన్ని నదులున్నా గ్రామాలకు నీళ్లందక గోస
అక్కడి ప్రజలు ఇప్పటికైనా మేల్కోవాలి.. లూటీని గుర్తించాలి
బిఆర్‌ఎస్‌తోనే దేశంలో సమూల మార్పులు: అధినేత, సిఎం కెసిఆర్
భారీగా మహారాష్ట్ర బిజెపి మైనార్టీ నేతల చేరికలు
మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్‌తో దేశ రాజకీయాల్లో సమూల మార్పులు ఖాయమని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చం ద్రశేర్‌రావు పునరుద్ఘాటించారు. ఈ పార్టీలకు ప్రత్యామ్నాయంగా అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ఉ ద్యమించిన బిఆర్‌ఎస్ పార్టీని ప్రజలు ఆదరించాలని కోరారు. బిజెపి పాలనలో హిందువులు, ఇత ర వర్గాలకు ఒరగబెట్టిందేమీ లేదని, మతం పేరుతో ప బ్బం గడుపుకోవడమే బిజెపి వ్యూహమని సిఎం తేల్చిచెప్పారు. దీన్ని యువత గుర్తించాలని సిఎం పిలుపునిచ్చా రు. సహజవనరులకు నెలవైన మహారాష్ట్రను ఇప్పటిదాకా పాలించిన పార్టీలు లూటీ చేశాయని, ప్రజలు ఇకనైనా మేల్కొనాలని అన్నారు. తెలంగాణ పథకాలను అ మలుచేస్తే అక్కడి పార్టీలే దివాలా తీస్తాయి కానీ ప్రజలు కాదనీ, ప్రజల జీవితాల్లో దీపావళి వెలుగులు ప్రసరిస్తాయని పేర్కొన్నారు. మహారాష్ట్ర బిజెపి మైనార్టీ నేతలు ఆ దివారం హైదరాబాద్‌లో బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, సిఎం కె సిఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. కెసిఆర్ వారికి గు లాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ… ఎన్నికలు రాగానే ప్రజలు ఆగమాగం కావద్దని, ప్రజల కోసం పనిచేసే పార్టీని, ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడే ప్ర జల ఆకాంక్షలు నెరవేరుతాయని స్పష్టం చేశారు. ఆరేడు దశాబ్దాలుగా గెలిపించిన పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు.
ఆలోచనతీరు మారాలి
మహారాష్ట్రలో పుష్కలమైన సహజవనరులున్నాయని, అ క్కడే ఎన్నో నదులు పుట్టి, ప్రవహిస్తున్నా గ్రామాలు, పట్టణాలు నీళ్లు లేక ఎందుకు గోసపడుతున్నాయో, అందు కు కారణమైన మూలాన్ని ప్రజలు గుర్తించాలని సిఎం కెసిఆర్ కోరారు. మనం ఓట్లేస్తూ పోతున్నాం, వాళ్ళు గె లుస్తూ పోతున్నారు. ఇకనైనా మన ఆలోచనతీరు మారాలని చెప్పారు. ఫూలే, అంబేద్కర్ వంటి ఎందరో సంఘసంస్కర్తలు, మేధావులు పుట్టిన నేల నీరు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు లేక వెనుబాటుకు గురికావడం శోచనీయమని పేర్కొన్నారు. వారి స్ఫూర్తితో దేశంలో సమూల మా ర్పే ల క్ష్యంగా ప్రజలు చైతన్యులై ఉద్యమించాలని కోరారు. కాం గ్రెస్, బిజెపి పార్టీలకు అధికారం ఇ స్తూ పోతున్నా ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాకపోవడంపై ప్రజలు, యు వత ఆలోచించాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు.
బిజెపిలో చేరిన మహారాష్ట్ర నేతలు
సంఘర్ష్ కామ్ గార్ కర్మాచారి యూనియన్, ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసో సియేషన్, అన్నా మా థాడి ట్రాన్స్ పోర్టు కామ్ గార్ యూనియన్ వంటి సంస్థలతో పాటు సంస్థ ప్రెసిడెంట్ సంజయ్ దినకర్ పాటిల్ బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మహారాష్ట్ర సోలాపూర్ నుంచి వల్యాల నగేష్ నేతృత్వంలో ముస్లిం మైనార్టీ నేతలు, బీడ్ జిల్లా నుంచి ఫూల్ చంద్ కరాడ్ ఆధ్వర్యంలో, మాజీ ఎంఎల్‌ఎ ముల్ల ర్ అంకోలా నుంచి, మహారాష్ట్ర కిసాన్ సెల్ ప్రెసిడెంట్ సంజయ్ పాటిల్ కొల్లాపూర్ నుంచి బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. బిజెపి మైనార్టీ ఫ్రంట్ సోలాపూర్ సిటి ప్రెసిడెంట్ మొహసీన్ షేక్, బిజెపి మైనా ర్టీ ఫ్రంట్ ఎగ్జిక్యూటివ్ మెంటర్ మహారాష్ట్ర స్టేట్ జాకీర్ హుస్సేన్ దోకా, బిజెపి మైనార్టీ ఫ్రంట్ సోలాపూర్ వుమెన్ సిటి ప్రెసిడెంట్ బిల్క్విస్ సయ్య ద్, బిజెపి మైనార్టీ ఫ్రంట్ సోలాపూర్ సిటి సెక్రటరీలు కరీమ్ సయ్యద్, హజి అకిల్ నల్వర్, బిజెపి మైనార్టీ ఫ్రంట్ సోలాపూర్ సిటి వైస్ ప్రెసిడెంట్ అఖలక్ మషల్కర్, బిజెపి మైనార్టీ ఫ్రంట్ సోలాపూర్ జోనల్ ప్రెసిడెంట్ సిటి సెంటర్ రజ్వాన్ షేక్, బిజెపి మై నార్టీ ఫ్రంట్ సోలాపూర్ మీడియా హెడ్ లు ఎక్బాల్ భగవాన్, రిజ్వాన్ పీర్జాదే, సల్మా న్ కంప్లి, బిజెపి మైనార్టీ ఫ్రంట్ సోలాపూర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అజహర్ నదాఫ్, బిజెపి మైనార్టీ ఫ్రంట్ సోలాపూర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అజహర్ పఠాన్, బిజెపి సిటీ సెక్రటరీ హాజి అహ్మద్ నల్వా ర్, బిజెపి ముస్లిం సెల్ వైస్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ నదాఫ్, ఇతర భాధ్యులు రిజ్వాన్ అబ్దుల్ ఆరీఫ్, షబ్బీర్ ఇమామ్ షే క్, అకారీమ్ సయ్యద్, అక్లక్ మ షల్కర్, అజహర్ పఠాన్, జీషాన్ సలీమ్ సయ్యద్, సల్మాన్ కుంపల్లి, సజ్జద్ రజ్ బరే, బిల్కిస్ గాఫుర్ సయ్యద్, జకీర్ దో క, చాంద్ సయ్యద్, సద్దాం న దాఫ్, ఆసిఫ్ సయ్య ద్, హలీమా షేక్, అషరఫ్ పో ట్కుండే, ఫిరోజ్ జ మాదార్, హజి షాన్వాజ్ షేక్, మెహబూబ్ సయ్య ద్, రఘు అంతోజమ్, దీపక్ వీరబత్తిని తదితరులు బిజెపిలో చేరారు. వీరితో పాటు నాందేడ్ జిల్లా కు చెందిన జెడ్‌పి మెంబర్లు సంతోష్ వర్కాడ్, సాహెబ్రావో ధాంగే, ప్రతాప్ దేశ్ ముఖ్, బల్వంత్ పుయ డ్, గ్రామ పంచాయతీ మెంబర్లు రాహుల్ అథవాలే, ఓమ్ పవార్, నర్సింగ్ అథవాలేతో పాటు ప లు రాజకీయ సంఘాలకు చెందిన ప్రముఖులు, ఇతర పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న నేతలు బిఆర్‌ఎస్‌లో చేరారు. వీరిలో ఓమ్ కార్ రఘునాథ్ బడఖ్, ప్రశాంత్ కుండ్లిక్రావ్ మాస్కే, హ నుమంత్ మహారాజ్ పహునే, రామ్ దాస్ బన్కర్, దాదాసాహెబ్ ఖాంగల్, అన్నా సుప్నార్, శంకర్ కోప్నర్, అశోక్ నివృత్తి బాగుల్, ప్రవీణ్ తింబక్ అరు, సుభా ష్ దాదా హల్నర్, జిశాన్ జివాని, పయజ్ కురేషి, అభిజిత్ అశోక్ బాగుల్ తదితరులున్నారు. మహారాష్ట్ర బిఆర్‌ఎస్ ఇంఛార్జి కల్వకుంట్ల వంశీధర్ రా వు, ఎంఎల్‌సిలు పల్లా రాజశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి, బిఆర్‌ఎస్ నాయకులు శంకరన్న ధోండ్గే, మాణిక్ కదమ్‌లు పాల్గొన్నారు.స్వరాష్ట్రంగా అవతరించిన అనతి కాలంలోనే సంక్షేమంలో, అభివృద్ధిలో అగ్రగామిగా వెలుగొందుతు న్న తెలంగాణ రాష్ట్రంపై యావత్ దేశం చూపు నిలిపింది. సర్వజనాభ్యుదయమే లక్ష్యంగా సిఎం కెసిఆర్ సారథ్యంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న పటిష్ట కార్యాచరణకు ఆకర్షితులైన రైతులు, మహిళలు, మేధావులు, సైనికులు ..ఇలా ఒక్కో వర్గం బిఆర్‌ఎస్ పార్టీకి జై కొడుతూ వస్తున్నారు.