- Advertisement -
న్యూఢిల్లీ : యూనికార్న్ స్టార్టప్ స్లైస్ యాప్ హానికరం, ‘మీ పరికరాన్ని ప్రమాదంలో పడేస్తుంది‘ అని గూగుల్ ప్లే ప్రొటెక్ట్ వినియోగదారులకు నోటిఫికేషన్ పంపింది. ఈ యాప్ వినియోగదారుల వ్యక్తిగత డేటాపై గూఢచర్యం చేయడానికి ప్రయత్నిస్తోందని గూగుల్ పేర్కొంది. దీనిని అన్‌ఇన్‌స్టాల్ చేయాలని వినియోగదారులను సిఫార్సు చేసింది. గూగుల్ ఈ మెసేజ్ పంపిన తర్వాత స్లైస్ స్పందించింది. ఇది సాంకేతిక లోపమని, దీనిని పరిష్కరించామని తెలిపింది.
- Advertisement -