కేప్‌కెనవరల్ (అమెరికా): అమెరికా అంతరిక్ష సంస్థ బ్రూ ఆరిజన్ అధిపతి అయిన, మరో కుబేరుడు జెఫ్ బెజోస్‌తోపాటు మరో ముగ్గురి అంతరిక్ష విహారానికి అమెరికా ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. వచ్చే మంగళవారం వీరు పశ్చిమటెక్సాస్ నుంచి న్యూషెపర్డ్ రాకెట్ ద్వారా ‘సబ్ ఆర్బిటల్’ యాత్ర చేసి వస్తారు. ఈ విహారంలో బెజోస్, ఆయన సోదరుడు, 82 ఏళ్ల వయసున్న ఏవియేషన్ నిపుణురాలు, 2.8 కోట్ల డాలర్ల వేలంలో విజేతగా నిలిచిన వ్యక్తి పాల్గొంటారు. ప్రయాణికులతో బ్లూ ఆరిజన్ సంస్థ వ్యోమనౌక యాత్ర నిర్వహించడం ఇదే మొదటి సారి. ఆదివారం వర్జిన్ గెలాక్టిక్ సంస్థకు చెందిన విఎస్‌ఎస్ యూనిటీ 22లో ఆ సంస్థ అధిపతి రిచర్డ్ బ్రాన్సన్ తెలుగు అమ్మాయి బండ్ల శిరీక్ష, మరో నలుగురు రోదనీ లోకి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. బ్లూ ఆరిజన్ నౌకను పునర్వినియోగ బూస్టర్ ద్వారా రోదసీ లోకి పంపుతారు. యాత్ర తరువాత అది పారాచూట్ సాయంతో ఎడారిలో దిగుతుంది. అంతరిక్ష యాత్రంలో బ్లూఆరిజన్, వర్జిన్ గెలాక్టిక్ సంస్థలు పోటీ పడుతున్నాయి.
Bezos’ Blue Origin gets approval to send him