Friday, November 22, 2024

అమెజాన్ బెజోస్ రోదసీ యాత్ర సక్సెస్

- Advertisement -
- Advertisement -

Bezos space mission successful

అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన రెండో శ్రీమంతుడు
ఆయనతో పాటుగా మరో ముగ్గురు
‘ న్యూషెపర్డ్’ ప్రయోగం విజయవంతం
పావు గంటలో రోదసికి వెళ్లి తిరిగొచ్చిన వ్యోమనౌక

వాన్ హార్న్(టెక్సాస్): అంతరిక్షయానంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌తో పాటు మరో ముగ్గురితో కూడిన ‘ న్యూషెపర్డ్’ ప్రయోగం విజయవంతమైంది. నలుగురు ప్రయాణికులతో కూడిన ‘న్యూషెపర్డ్’ అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి భూమికి చేరుకుంది. రోదసి పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా అమెజాన్ అధినేత స్వీయ సంస్థ ‘ బ్లూ ఆరిజిన్’ ఈ యాత్రను చేపట్టింది. ఇందులో బాగంగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ఆయన సోదరుడితో పాటుగా మరో ఇద్దరు అంతరిక్ష ప్రయాణం సాగించారు. వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష యాత్ర విజయవంతమైన కొద్ది రోజులకే అమెజాన్ అధినేత స్వీయ సంస్థ ‘ బ్లూ ఆరిజిన్’ ప్రయోగం కూడా విజయవంతం కావడం విశేషం.

11 నిమిషాలు..106 కిలోమీటర్లు

పశ్చిమ టెక్సాస్ ఎడారిలోని ఓ మారుమూలప్రాంతంలో ఉన్న లాంచ్‌సైట్ వన్‌నుంచి భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు ‘ న్యూషెపర్డ్’ ప్రయోగం ప్రారంభమైంది. ‘ న్యూషెపర్డ్’ అంతరిక్షంలోకి దూసుకెళ్లే సమయంలో గంటకు 3750 కిలోమీటర్ల వేగాన్ని రాకెట్ అందుకుంది. నౌక బయలుదేరిన రెండు నిమిషాలకు వ్యోమగాములు 3 రెట్లు ఎక్కువ గురుత్వాకర్షణకు గురయ్యారు. అనంతరం వ్యోమగాములు సీటు బెల్టులు తొలగించి భార రహిత స్థితిని ఆస్వాదించారు. వ్యోమనౌక ప్రయాణం ప్రారంభమైన ఆరు నిమిషాలకు క్యాప్సూల్‌నుంచి విడిపోయిన బూస్టర్ రాకెట్ తిరిగి భూవాతావరణంలోకి పునః ప్రవేశించింది. ప్రయోగ వేదికకు 3.2 కిలోమీటర్ల దూరంలోని ల్యాండింగ్ ప్యాడ్‌కు చేరుకుంది. క్యాప్సూల్ మాత్రం సముద్ర మట్టానికి 106 కిలోమీటర్ల ఎగువన ఉన్న కార్‌మాన్ రేఖ వరకూ ప్రయాణించింది.ఆ సమయంలో వ్యోమగాములు కొద్ది సేపు భార రహిత స్థితిని పొందారు.

అనంతరం వ్యోమనౌక పారాచూట్ల సాయంతో తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశించింది. ఈ సమయంలో గంటకు 16 కిలోమీటర్ల స్థాయికి వేగాన్ని తగ్గించుకుంటూ నేలకు దిగింది. దాదాపు 15 నిమిషాల సేపు ఈ యాత్ర సాగింది. వ్యోమనౌక నేలకు తాకిన తర్వాత ఈ యాత్రలో పాల్గొన్న నలుగురు వ్యోమగాములు విజయ’ంకేతాన్ని చూపిస్తూ క్యాప్సూల్‌నుంచి టికి వచ్చారు. అక్కడే ఉన్న తమ భాగస్వాములను, తల్లిదండులను, పిల్లలను ఆలింగనం చేసుకుని తమ సంతోషాన్ని చాటారు. ‘ఇది తన జీవితంలో అత్యుత్తమమైన రోజు’ అని యాత్ర అనంతరం జెఫ్ బెజోస్ వ్యాఖ్యానించారు. ఈ యాత్రలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌తో పాటు ఆయన సోదరుడు మార్క్ కూడా ఉన్నారు. వీరితో పాటు మహిళా పైలట్ వేలీ ఫంక్(82),ఫిజిక్స్ విద్యార్థి ఆలివర్ డేమన్(18) కూడా ఉన్నారు. ప్రపంచంలోనే ఎక్కువ వయసున్న వ్యోమగామిగా వేలీ ఫంక్, తక్కువ వయసున్న వ్యోమగామిగా డేమన్ రికార్డు సృష్టించారు.

ఈ యాత్రకోసం తొలుత వేలంలో 2.8 కోట్ల డాలర్లు పెట్టి టికెట్ కొన్న వ్యక్తి మాత్రం చివరి నిమిషంలో అనివార్య కారణాలతో తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడు. దీంతో ఆయన స్థానంలో డేమన్‌కు అవకాశం లభించింది. బ్రాన్సన్‌కు చెందిన వర్జిన్ గెలాక్టిక్ పైలట్లతో కూడిన రాకెట్ విమానం కాగా ‘న్యూషెపర్’్డ పూర్తిగా ఆటోమేటెడ్ కావడమే కాక ఎలాంటి సిబ్బందీ అవసరం లేకుండా సాగిన ప్రయాణం కావడం గమనార్హం. రిచర్డ్ బ్రాన్సన్‌కు చెందిన వర్జిన్ స్పేస్ షిప్ 85 కిలోమీటర్ల ఎత్తుకు ప్రయాణించగా న్యూషెపర్డ్ 106 కిలోమీటర్లు ఎత్తుకు ప్రయాణించడం విశేషం.

అంతరిక్ష కాలనీలే లక్ష్యం

రోదసిలో తేలియాడే అంతరిక్ష కాలనీలను నిర్మించాలనే లక్షంతో జెష్ బెజోస్ 2000 సంవత్సరంలో బ్లూ ఆరిజిన్ సంస్థను ప్రారంభించారు. అక్కడ గురుత్వాకర్షణ శక్తిని కల్పించి లక్షలాది మంది పని చేస్తూ జీవించగలిగేందుకు అనువైన పరిస్థితులను సృష్టించాలనేది ఆయన లక్షంగా పెట్టుకున్నారు. ‘బ్లూ ఆరిజిన్’ ప్రస్తుతం‘ న్యూగ్లెన్’ అనే భారీ రాకెట్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉంది. చంద్రుడిపై దిగే ల్యాండర్‌ను కూడా అభివృద్ధి చేసి ‘నాసా’ చేపట్టే ‘ఆర్టెమస్’కార్యక్రమంలోను భాగస్వామి కావాలని భావిస్తోంది. కాగా ఈ ఏడాది చివరినాటికి మరో రెండు అంతరిక్ష యాత్రలు చేపట్టనున్నట్లు బ్లూ ఆరిజిన్ సిఇఓ బాబ్ స్మిత్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News