Tuesday, November 5, 2024

మహిళా బాక్సర్లను సత్కరించిన కేంద్ర క్రీడా శాఖ మంత్రి

- Advertisement -
- Advertisement -

BFI and SAI honor world championship medalists Nikhat Zareen

రూ. 50 లక్షలు అందించిన తెలంగాణకు నికత్ జరీన్ కృతజ్ఞతలు

న్యూఢిల్లీ : ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో విజేతలుగా నిలిచిన మహిళా బాక్సర్లను కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సత్కరించారు. ఢిల్లీ లోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా , ఇండియన్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో నిఖత్ జరీన్, ప్రవీన్ హుడా, మనీషా మౌన్ సహా బాక్సింగ్ కోచ్‌లను ఆయన అభినందించారు. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య ఇస్తాంబుల్‌లో నిర్వహించిన ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ 52 కేజీల విభాగంలో తెలంగాణ నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ స్వర్ణపతకం , ప్రవీణ్ హుడా , మనీషా మౌన్ కాంస్య పతకాలు సాదించిన విషయం తెలిసిందే.

ఇతర క్రీడాకారులకు మహిళా బాక్సర్లు స్ఫూర్తిగా నిలిచారని, కేంద్ర ప్రభుత్వం క్రీడాకారులకు అండగా ఉంటుందని మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. నిఖత్ జరీన్ మాట్లాడుతూ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణపతకం సాధించడం ఆనందంగా ఉందని, అయితే ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని ఉందని, తన తరువాతి టార్గెట్ కామన్వెల్త్ క్రీడా పోటీలని వెల్లడించారు. ముస్లిం మహిళగా క్రీడల్లో రాణించే అంశంపై ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించానని, తన నాన్న ప్రోత్సాహం , స్పాన్సర్ల మద్దతుతో ప్రతిభ చాటానన్నారు. 2014 లోతెలంగాణ ప్రభుత్వం తనకు రూ. 50 లక్షల ఆర్థిక సాయం అందించిందని కృతజ్ఞతలు తెలిపారు. . ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు కూడా ఆర్థిక సాయం చేస్తుందని ఆశిస్తున్నానని జరీన్ పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News