Thursday, January 23, 2025

బిఆర్ఎస్ పాలనలో విద్యార్థులకు అన్యాయం: రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉద్యోగాల భర్తీని బాధ్యతగా తీసుకొని ఆచరణలో పెడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. బిఎఫ్ ఎస్ఐ మినీ డ్రిగ్రీ కోర్సు ప్రారంభించిన సందర్భంగా రేవంత్ ప్రసంగించారు. టిఎస్ పిఎస్ సి వెబ్ సైట్లో 30 లక్షల మంది యువత పేర్లను నమోదు చేసుకున్నారని, ఇప్పటికే 35 వేల నోటిపికేషన్లు ఇచ్చామని, నిరుద్యోగత తీవ్రతను తమ ప్రభుత్వం గుర్తించిందని, తెలంగాణలో  50 నుంచి 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, అన్ని శాఖల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ చేపడుతామన్నారు. పదేళ్ల తరువాత కూడా రాష్ట్రంలో నిరుద్యోగం ఉందని, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేసినా నిరుద్యోగ సమస్య పోదన్నారు. పరిశ్రమలకు, నిరుద్యోగులకు మధ్య గ్యాప్ ఉందన్నారు.

65 ఐటిఐలను టాటా గ్రూప్ తో అప్ గ్రేడ్ చేస్తున్నామని, మొత్తం 75 ఐటిఐలు ఎటిసిలు మారుస్తున్నామని స్పష్టం చేశారు. ఉద్యోగాల కోసం విద్యార్థులు పోరాటం చేశారని, పదేండ్ల బిఆర్ఎస్ పాలనలో విద్యార్థులకు అన్యాయం జరిగిందని, విద్యార్థులంతా రోడ్డున పడ్డారని రేవంత్ విమర్శలు గుప్పించారు. నిరుద్యోగ సమస్యను గుర్తించామని, అన్ని శాఖల్లో భర్తీ ప్రక్రియ చేపట్టామని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఉద్యోగాలు లేక యువత డ్రగ్స్ కు బానిసగా మారుతున్నారని, గంజాయి, డ్రగ్స్ నివారణకు కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ హెచ్చరించారు. డ్రగ్స్ కేసుల్లో ఎవరున్నా వదిలిపెట్టబోమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News