Thursday, January 23, 2025

2000 ఎలక్ట్రిక్ వాహనాలను పంపిణీ చేయనున్న బిగాస్

- Advertisement -
- Advertisement -

ప్రముఖ లాస్ట్-మైల్ లాజిస్టిక్స్ ప్రొవైడర్ అయిన PIQYU, ప్రముఖ ఫైనాన్స్ ప్లాట్‌ఫారమ్ అయిన Bikebazaarతో ప్రతిష్టాత్మక భాగస్వామ్యం చేసుకున్నట్లు ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ BGauss వెల్లడించింది. చివరి-మైలు డెలివరీ కార్యకలాపాలను విప్లవాత్మకంగా మార్చడం, స్థిరమైన రవాణా పరిష్కారాల స్వీకరణను ప్రోత్సహించడం ఈ భాగస్వామ్యం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ భాగస్వామ్యం ద్వారా, BGAUSS నుండి ప్రారంభ 150 యూనిట్ ల ఎలక్ట్రిక్ వాహనాలకు ఫైనాన్సింగ్‌ను బైక్ బజార్ సులభతరం చేస్తుంది. తద్వారా PIQYU ఈ వాహనాలను సజావుగా కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ వ్యూహాత్మక భాఫాస్వామ్యం, హైదరాబాద్‌లో PIQYU యొక్క 3PL, లాస్ట్ మైల్ డెలివరీ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం, ఈ సంవత్సరం ఇతర నగరాల్లో విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ భాగస్వామ్యాన్ని గురించి BG ఎలక్ట్రిక్ స్కూటర్స్ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ మరియు RR గ్లోబల్ డైరెక్టర్ హేమంత్ కబ్రా మాట్లాడుతూ.. ” ప్రపంచ స్థాయి నాణ్యత, సాంకేతికతతో కూడిన దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తుది వినియోగదారుల కు మాత్రమే కాకుండా వృద్ధి, స్థిరత్వం కోసం ఈ వ్యవస్థ అంతటా భాగస్వామ్యాలతో ముందుకు వెళ్లడమే మా లక్ష్యం. PIQYU, BikeBazaarతో ఈ భాగస్వామ్యంతో, మేము పొదుపు పరంగా ఎలక్ట్రిక్ మొబిలిటీని స్వీకరించడం వల్ల కలిగే ప్రత్యక్ష ప్రయోజనాన్ని ప్రదర్శించాలనుకుంటున్నాము. పరిశుభ్రమైన వాతావరణానికి తోడ్పాటు అందించటం గురించి కూడా వెల్లడిస్తున్నాము” అని అన్నారు.

BG ఎలక్ట్రిక్ స్కూటర్స్ వద్ద , EV ఎకో సిస్టమ్‌ను మెరుగుపరచడానికి ఎలక్ట్రిక్ స్కూటర్‌ల యొక్క ఉత్తమ నాణ్యత, అమ్మకాల తర్వాత సేవను అందించడం లక్ష్యంగా చేసుకున్నాము. ఈ తరహా B2B భాగస్వామ్యాలు జీరో ఉద్గారాల ద్వారా చివరి మైలు డెలివరీలను విస్తరింప చేయడానికి అనుమతిస్తుంది.

BG ఎలక్ట్రిక్ స్కూటర్లు BG D15ను విడుదల చేసింది. అత్యంత ఆకర్షణీయమైన, 16” వీల్స్ మెటల్ బాడీ స్కూటర్‌ను పూర్తిగా భారతదేశంలోనే తయారు చేసి, సౌకర్యం, భద్రతతో ఎక్కువ సవారీ చేయాలనుకునే భారతీయ వినియోగదారుల పెరుగుతున్న డిమాండ్‌లను తీర్చడానికి పరిచయం చేసింది. ఇది కఠినమైన, స్టైలిష్, స్మార్ట్ ఉత్పత్తి, ఇది లాస్ట్ మైల్ డెలివరీ భాగస్వాములతో సహా ప్రతి EV ఔత్సాహికుల ఎంపికగా నిలువడానికి సాంకేతికత, అత్యుత్తమ రైడింగ్ అనుభవాన్ని మిళితం చేస్తుంది.

బైక్ బజార్ ఫైనాన్స్ జాయింట్ ఎండి, కో-ఫౌండర్ కరుణాకరన్ వి మాట్లాడుతూ.. “సాంప్రదాయ రిటైల్ ఫైనాన్స్ రుణాలకు భిన్నంగా EV స్వీకరణను వేగవంతం చేయడానికి వినూత్న ఫైనాన్సింగ్ పరిష్కారాలు అవసరం. బైక్ బజార్ ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రత్యేకంగా తీర్చిదిద్ది ఫైనాన్స్ సొల్యూషన్స్‌ని అనుసరించడానికి కట్టుబడి ఉంది. బైక్ బజార్ పర్యావరణ, సామాజిక, పరిపాలన (ESG) అభ్యాసాల రంగంలో సానుకూల ప్రభావాన్ని సృష్టించడానికి అంకితం చేయబడింది. ఈ సహకారం హరిత వాతావరణాన్ని పెంపొందించడంలో మా స్థిరమైన నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది. PIQYU, BGAUSS భాగస్వామ్యంతో, ముఖ్యంగా లాస్ట్ మైల్ డెలివరీ సెక్టార్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు మారడాన్ని వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషించగల మా సామర్థ్యంపై మాకు నమ్మకం ఉంది…” అని అన్నారు.

ఈ భాగస్వామ్యం సుస్థిర రవాణాకు మూడు కంపెనీల నిబద్ధతను ప్రదర్శించడమే కాకుండా సానుకూల మార్పును నడపడానికి సహకారం యొక్క శక్తిని కూడా ప్రదర్శిస్తుంది. వారి నైపుణ్యం, వనరులను కలపడం ద్వారా, BGauss, PIQYU, Bikebazzar మరింత స్థిరమైన, పర్యావరణ అనుకూల భవిష్యత్తును సృష్టించే దిశగా గణనీయమైన చర్యలు తీసుకుంటున్నాయి.

PIQYU యొక్క సీఈఓ ప్రశాంత్ రెడ్డి ఈ భాగస్వామ్యం గురించి తన ఉత్సాహాన్ని వెల్లడించటం తో పాటుగా మరింత స్థిరమైన భవిష్యత్తు కోసం సంస్థ యొక్క విజన్‌ను వివరించారు. “PIQYU వద్ద, మేము హరిత, మరింత స్థిరమైన డెలివరీ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి కట్టుబడి ఉన్నాము. BGauss, బైక్ బజార్‌లతో మా సహకారం కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, పర్యావరణ అనుకూలమైన చివరి మైలు పరిష్కారాలను ప్రోత్సహించడం అనే మా లక్ష్యంతో సంపూర్ణంగా సమలేఖనం చేయబడింది” అని అన్నారు.

EV లీజ్ టు ఓన్ ప్రోగ్రామ్ ద్వారా డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లకు సాధికారత కల్పించడం యొక్క ఆవశ్యకతను శ్రీ ప్రశాంత్ నొక్కి చెప్పారు. “మా డెలివరీ భాగస్వాములకు వృద్ధి, ఆర్థిక స్థిరత్వానికి అవకాశాలను అందించడాన్ని మేము విశ్వసిస్తున్నాము. EV లీజ్ టు ఓన్ ప్రోగ్రామ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లను సౌకర్యవంతమైన చెల్లింపు అవకాశాలతో ఎలక్ట్రిక్ టూ-వీలర్‌లను లీజుకు ఇవ్వడానికి అనుమతిస్తుంది. ఈ ప్రోగ్రామ్ పర్యావరణ అనుకూల మొబిలిటీని ప్రోత్సహించడమే కాకుండా వాహన యజమానులు, వ్యవస్థాపకులుగా మారడంలో మా డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లకు తగిన సాధికారత ఇస్తుంది. వారికి సహాయం చేస్తుంది” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News