కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని భవానీపూర్ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 30న జరగాల్సిందేనని కలకత్తా హైకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. ఒకవేళ భవానీపూర్ ఉప ఎన్నికను నిర్వహిస్తే రాజ్యాంగ సంక్షోభం తలెత్తగలదని పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారన్నది ఇక్కడ గమనార్హం.
ఉప ఎన్నిక నిర్వహణను ఆపాలని కోరుతూ ఆ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాసిన లేఖను, ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రాజేశ్ బిన్‌దాల్, న్యాయమూర్తి ఆర్. భరద్వాజ్‌తో కూడిన ధర్మాసనం అసమంజసమైనదిగా భావించి కొట్టేసింది. పిల్‌లో వాడిన భాషను కూడా ధర్మాసనం తప్పుపట్టింది.షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 30న ఉప ఎన్నిక జరగాల్సిందేనని తీర్పు చెప్పింది.