Wednesday, January 22, 2025

భయం గుప్పిట్లో భద్రాద్రి

- Advertisement -
- Advertisement -

మూడో ప్రమాద హెచ్చరిక జారీ గోదావరి ఉధృతి
60 అడుగులకు చేరే ప్రమాదం అధికార యంత్రాంగం అప్రమత్తం

హైదరాబాద్:  ఎగువన మహారాష్ట్ర, చత్తిస్‌గడ్ రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో గోదావరి పరివాహంగా పెన్‌గంగ, వార్ధా, ప్రాణహిత, ఇంద్రావతితోపాటు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నా యి. శుక్రవారం ఉదయం నుంచి గోదావరి నదిలో వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. తాజా సమాచారం మేరకు భద్రాచలం వద్ద గోదావరి నదిలో నీటిమట్టం 53అడుగులకు చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ ,మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అర్ధరాత్రికి నదిలో నీటిమట్టం 58అడుగులకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు . కలెక్టర్ ప్రియాంక ఎప్పటికపుడు వరద పరిస్థితులను సమీక్షిస్తూ అధికార యంత్రాగానికి దిశా నిర్దేశం చేస్తున్నారు. నదిలో నీటిమట్ట 58అడుగుల స్థాయికి చేరితే భద్రాచలం పట్టణం డేంజర్ జోన్‌లో ఉన్నట్టే భావించాల ని ప్రియాంక మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే భద్రాచలం పట్టణంలోకి వరద నీరు ప్రవేశించింది. రామాల యం చుట్టు వరదనీరు చుట్టుముట్టింది. బారీ మోటార్లతో నీటిని తోడిపోస్తున్నా పరిస్థితి దారికి రావటం లేదు. సహా య పునరావాసచర్యలకోసం ఇప్పటికే రెండు హెలికాప్టర్లను సిద్దంగా ఉంచారు. ఎన్‌డిఆర్‌ఫ్ బృందాలు కూడా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.
శ్రీరాంసాగర్‌కు 1.75లక్షల క్యూసెక్కులు
ఎగువ నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 1.75లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. ప్రాజెక్టు 18గేట్లు ఎత్తివేశారు. 58వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఇన్‌ఫ్లో 6.44లక్షల క్యూసెక్కులు ఉండగా , 6.94లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మేడిగడ్డ వద్ద 13.58లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా బ్యారేజి 85గేట్లు తెరిచి వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు వదులుతున్నారు. కడెం ప్రాజెక్టులో పరిస్థితి అదుపులోకి వ చ్చింది. దుమ్ముగూడెంవద్ద సీతమ్మసాగరర్ బ్యారేజి నుం చి 13.48లక్షలక్యూసెక్కులు దిగువ నదిలోకి వెళుతోం ది. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 45వేలక్యూసెక్కుల నీరు చేరుతుండగా అంతే నీటిని దిగువకు వదలుతున్నారు.
కృష్ణమ్మ పరుగులు!
ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ఆల్మట్టిలోకి 1.57లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, గేట్లు తెరిచి 1.21క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 1.20లక్షల క్యూసెక్కుల నీరు చేరతుండగా 22గే ట్లు తెరిచి దిగువకు నీటిని వదలుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 66800 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటిమట్టం 825 అడుగులకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News