Sunday, January 19, 2025

భద్రాద్రి తెలంగాణకు గుదిబండ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/భద్రాద్రి కొత్తగూడెం: గత ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలతో విద్యుత్ రంగం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిందని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. భ విష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిబద్దతో ప్రణాళికా బద్ధంగా ముందు చూపుతో అడుగులు వేయాల్సిన అవసరం ఉందని ఆయనన్నారు. శనివారం హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా మణుగూరు జూనియర్ కళాశాలకు చేరుకున్న ఆయన బిటిపిఎస్ విద్యుత్ ప్లాంటును సందర్శించి పరిశీలించారు. అనంతరం విద్యుత్ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులు పరిశీలిస్తూ వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియచేస్తున్నామని చెప్పారు.

ప్రభుత్వం ఏర్పాటు కాగానే గత ప్రభుత్వం చేసిన అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా శ్వేతపత్రం విడుదల చేసందని చెప్పారు. మనిషి మనుగడకు వి ద్యుత్‌తో విడదీయరాని బంధం ఏర్పడిందని, లో తుగా అధ్యయనం చేస్తూ సమస్యలను అధిగమించి సమాజానికి మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు ప్ర భుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ ప్రాంత ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగ, పౌర సమాజ లక్ష్యాలను సాధించడానికి నిరంతరం అంకితభావంతో పనిచేస్తున్నామన్నారు. ప ర్యావరణ సమస్య రాకుండా సూపర్ క్రిటికల్ సాం కేతిక పరిజ్ఞానం వినియోగించాల్సి ఉండగా సబ్ క్రిటికల్ సాంకేతికతను వినియోగించడం వల్లరా మెటీరియల్ ధరలు పెరిగి, పర్యావరణ సమస్యలతో భారం పడినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హ యాంలో జరిగిన అంకెలు, సంఖ్యల సమాచారం చాలా ఆందోళన కరంగా ఉన్నట్లు చెప్పారు. మిగు లు బడ్జెట్‌తో ఏర్పడిన రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని, లెక్కలు చూస్తుంటే చాలా ఆందోళనకరంగా, ఆశ్చర్యంగా ఉన్నాయని స్ప ష్టం చేశారు.

రాష్ట్ర విభజన జరిగే నాటికి రూ. 7,259 కోట్లు మాత్రమే బకాయిలుంటే తొమ్మిదిన్నరేళ్లలో విద్యుత్ రంగం రూ. 81,516 కోట్లు అప్పులు చేసిందన్నారు. యాదాద్రి, భద్రాద్రి పవ ర్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నామని అప్పులు తెచ్చారన్నారు. ప్రభుత్వం ద్వారా పంపిణీ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు 28,842 కోట్లు వెరసి మొత్తం రూ. 1,10,358 కోట్లు అప్పులున్నట్లు వెల్లడించారు. 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ ఇచ్చామని చెప్పిన లెక్కలు చూస్తుంటే భవిష్యత్ తరాలను తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కొనుగోలు కోసం రూ. 30,406 కోట్లు వెచ్చించారని, సింగరేణికి కట్టాల్సిన విద్యుత్ బకాయిలు 19,431 కోట్లు, జెన్‌కోకు 9,743 కోట్లు, మొత్తం విద్యుత్ కొనుగోలు బకాయిలు 59,580 ఉన్నట్లు చెప్పారు. పీకల్లోతు అప్పుల్లో ముంచిన రాష్ట్రాన్ని తిరిగి ట్రాక్ మీద పెట్టాలంటే లోతుగా అధ్యయనం చేస్తూ ఉన్న సమస్యలను అదిగమిస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో విద్యుత్ ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ అలి ముర్తుజా రిజ్వీ, ఉప ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి క్రిష్ణభాస్కర్, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. వైరా శాసనసభ్యులు డా. రాందాస్ నాయక్, మాజీ శాసనసభ్యులు పోదెం వీరయ్య, సిఇలు పప్పుల రత్నాకర్, బిచ్చయ్య, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News