- Advertisement -
మహబూబాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఎస్‌ఐ ఆత్మహత్యాయత్నం చేశాడు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు ఎస్‌ఐ శ్రీనివాస్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే 108 కాల్ చేసి సమాచారం ఇవ్వడంతో అతడిని వైద్య సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సదరు ఎస్‌ఐని వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అశ్వారావుపేటలో ఎస్‌ఐ శ్రీనివాస్ ఆదివారం ఉదయం బయటకు వెళ్లి రాకపోవడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
- Advertisement -