Tuesday, January 21, 2025

రైలు పట్టాలపై మద్యం తాగారు… రైలు కిందపడి యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ శివారులో ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. యాకూబ్ పాషా అనే యువకుడు(31) గాంధీనగర్‌లో నివసిస్తున్నాడు. బుధవారం సాయంత్రం యాకుబ్ పట్టాలపై కూర్చొని మద్యం సేవిస్తున్నాడు. ట్రాక్ మెన్ అతడి దగ్గరకు వచ్చి రైలు వచ్చే సమయం అసన్నమైంది ఇక్కడి నుంచి వెళ్లాలని యాకూబ్‌కు సూచించాడు. రాత్రి ఏడు గంటలకు ట్రాక్ పరిశీలిస్తుండగా మృతదేహం కనిపించడంతో రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అతడి భార్య, స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతుడి భార్య సన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు బాలుర్లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News