హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు… భార్యతో గొడవలు రావడంతో అత్తారింటికి వెళ్లిన అల్లుడిపై పెట్రోల్ పోసి తగలబెట్టడంతో అతడు చనిపోయిన సంఘటన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. దంతెలబోర ఎస్‌సి కాలనీకి చెందని బల్లెం గౌతమ్(24), టేకులపల్లి మండలం రామచంద్రని పేటకు చెంది ఎజ్జు కావ్యతో ప్రేమలో పడ్డాడు. మూడు సంవత్సరాల క్రితం ఇద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. గౌతమ్ బీటెక్ చదివి ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. గత కొన్ని రోజులుగా భార్యభర్తలు మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకొవడంతో కావ్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నెల 2న అల్లుడి అత్తారింటికి వెళ్లి భార్యతో మాట్లాడుతుండగా ఘర్షణ తారా స్థాయికి చేరుకుంది. అత్త మామ, ఇద్దరు బామ్మర్థులు అల్లుడిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. మంటలు తట్టుకోలేక గౌతమ్ నీటి తొట్టిలో మునిగాడు. వెంటనే గ్రామస్థులు అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం గౌతమ్ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమ పెళ్లి…. అల్లుడిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు
- Advertisement -
- Advertisement -
- Advertisement -