Sunday, January 19, 2025

చెట్టును ఢీకొట్టిన బైక్: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

మణుగూరు: బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఐలాపూర్ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. మద్దెల సదీన్(25) అనే యువకుడు తన సొంతూరు కిష్ణాపురం-కొత్తూరు గ్రామానికి వస్తుండగా ఐలాపురం గ్రామ శివారులో బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో అతడు దుర్మరణం చెందాడు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News