- Advertisement -
ఇల్లందు: భద్రాద్రి జిల్లా ఇల్లందులో ఓ ఆర్‌టిసి డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్‌టిసి డ్రైవర్ శ్రీను తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -