Monday, November 18, 2024

భద్రాద్రికి పోటెత్తిన భక్తులు

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి: దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రధాన ఆలయాలకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇక భద్రాద్రి సీతారాముల కళ్యాణం కోసం లక్ష మందికి పైగా భక్తులు హాజరయ్యారు. ఎక్కడ చూసిన భక్తులు రామజపంతో మునిగిపోయారు.

మిథిలా స్టేడియంలో జరగనున్న సీతారామా కల్యాణం కోసం.. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమర్పించారు. కల్యాణం వీక్షించేందుకు వీఐపీతో పాటు 26 సెక్టార్లు.. ఎల్ఈడి తెర లు ఏర్పాటు చేశారు. భక్తులకు మూడు లక్షల లీటర్ల మంచినీరు, లక్ష మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. భక్తులకు అందుబాటులో రెండు లక్షల లడ్డు ప్రసాదాలు, 200 క్వింటాల తలంబ్రాలు.. వాటి పంపిణీకి 70 కౌంటర్స్ ఏర్పాటు చేశారు.

మొదట గర్భగుడిలో రామయ్య మూలవిరాట్‌కు లఘుకల్యాణం నిర్వహించారు. ఆపై అభిజిత్‌ లగ్నంలో వేలాది మంది భక్తుల నడుమ మధ్యాహ్నం 12 గంటల సమయంలో కల్యాణం జరగనుంది. రేపు(శుక్రవారం) స్వామివారికి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు. రాములోరి కల్యాణాన్ని వీక్షించడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భద్రాదికి భక్తులు తరలివచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News