పదేళ్ల తర్వాత కల్యాణం టికెట్ల ధరల పెంపు
మనతెలంగాణ/భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా ఈవో శివా జీ వెల్లడించారు. దీనిలో భాగంగా 10వ తేదీన స్వామి వారి కల్యాణం,11నపట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈమేరకు ఆలయ వైదిక క మిటీ నిర్ణయించింది. కాగా, పదేళ్ల తర్వాత ఈ సారి సీతారాముల కల్యాణం, మహా పట్టాభిషే కం టిక్కెట్ల ధరలు పెంచినట్లుగా ఆయన వెల్లడించారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈవో మాట్లాడుతూ.. గత ంలో రూ. 5 వేలు ఉన్న ఉభయదాతల టిక్కెట్టు ధరను రూ. 7,500లకు, రూ. 2వేల విలువ చేసే 1ఏ సెక్టార్ టిక్కెట్ ధర రూ.2,500లు, రూ.1,116లు ఉండే 1సీ సెక్టార్ టిక్కెట్ ధరను రూ. 2వేలకు, రూ.500లు టిక్కెట్ ధర ఉండే 1ఇ, 1ఎఫ్ సెక్టార్ల టిక్కెట్ రూ. 1000లు, రూ. 100ల ఉండే సెక్టార్ల ధర రూ.150లకు, రూ. 200లు ధర ఉండే సెక్టార్ టిక్కెట్ ధర రూ.300లు, అదేవిధంగా పట్టాభిషేకం ఉభయదాతల టిక్కెట్ ధర రూ.250 నుంచి రూ. 1000లకు పెంచినట్లుగా ఆయన వివరించారు.
ఆలయానికి రూ.25 లక్షలకుపైగా విరాళం ఇచ్చే భక్తునికి 1సి సెక్టారులో కల్యాణ వీక్షణానికి 2 ఫ్లవర్ బ్యాడ్జిలు అందివ్వనున్నట్టు వెల్లడించారు. దాతలను ప్రోత్సహించాలని ఈ నిర్ణ యం తీసుకున్నట్లుగా ఈవో తెలిపారు. ఇదిలా ఉండగా.. భద్రాచలం రాలేని భక్తులకు పరోక్ష సేవలనూ ఈసారి తీసుకొచ్చినట్లుగా తెలిపారు. రూ.5వేలు చెల్లిస్తే భక్తుల గోత్రనామాలతో అర్చన చేసి శేషవస్త్రాలు, 5 ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు, కుంకుమ, మిస్రీ ప్రసాదం, రూ.1100 చెల్లిస్తే గోత్ర నామాలతో అర్చన, 2 ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు, కుంకుమ, మిస్రీ ప్రసాదం పంపిస్తామన్నారు. గతం లో సీతారాముల కల్యాణం టిక్కెట్లపై రూ.1.30 కోట్ల ఆదాయం వచ్చేదని, ఈసారి పెంచిన ధరలతో రూ.2 కోట్లు వరకు ఆదాయం వస్తుందన్నారు.