Friday, November 15, 2024

డిసెంబర్‌కల్లా సిద్ధం

- Advertisement -
- Advertisement -

నూతన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులు శర వేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా పవర్ ప్లాంట్‌ను రెడీ చేస్తున్నారు. తొలి స్టేజ్ డిసెంబర్‌కు, రెండో స్టేజ్ వచ్చే ఏడాది జులై నాటికి పూర్తి చేయించి తెలంగాణకు విద్యుత్ వెలుగులు అందించనున్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు నిర్మాణంపై ఇటు సంబంధిత విద్యుత్ శాఖ అధికారి ( డైరెక్టర్ ప్రాజెక్ట్ ) సచ్చిదానందం, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పనుల ప్రగతిని ప్రభుత్వానికి చేరవేస్తున్నా రు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం మొదటి స్టేజ్‌లో ఒకటి రెండు యూనిట్లు , అలాగే రెండో స్టేజ్‌లో మూడు, నాలుగు, ఐదు యూనిట్ల పనులు కొనసాగుతున్నాయని, స్టేజీల వారీగా చూస్తే ఒక్కో స్టేజీ నిర్మాణం కోసం 7 మాసాల సమయం పట్టవచ్చని చెబుతున్నారు. ఈ లెక్కన రెండు స్టేజీలకు 14 నెలల సమయం తీసుకోవ చ్చు.

కాగా విద్యుత్ ఉత్పత్తి పరంగా యూని ట్ 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చొప్పున 5 యూనిట్లకు గాను 5×800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగనుంది. ఇలా యాదాద్రి విద్యుత్ కేంద్రం పనులు ఇప్పటివరకు సుమారు 80 శా తం వరకు జరిగినట్లు తెలుస్తోంది. ఈ వేసవిలో నూ నిరంతర విద్యుత్ అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం యాదాద్రి థర్మల్ వి ద్యుత్ కేంద్రాన్ని సకాలంలో పూర్తి చేయడం ద్వా రా రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ను సాకారం చే సుకోవచ్చని అంచనా వేస్తోంది. 2017 అక్టోబర్ 17న శంకుస్థాపనతో బీజం వేసుకున్న ఈ విద్యు త్ కేంద్రం నిర్మాణ పనులు వేగంగా సాగుతున్న క్రమంలో పర్యావరణ అనుమతుల రూపంలో కేం ద్ర కొర్రీలు వేడయంతో ఆలస్యమవు తూ వచ్చింది. ఈ ఏడాది జూన్ కల్లా థర్మల్ విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చే దిశగా యాదాద్రి థ ర్మల్ విద్యుత్ కేంద్రం పనులు సాగుతు వచ్చాయి.

Also Read: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండు అవార్డులు

అయితే సిఎం కెసిఆర్ జాతీయ స్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టడం, టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చి జాతీయస్థాయిలో దూసుకెళ్లేలా చే యడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల దగ్గర నుంచి థర్మల్ పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతుల వరకు కేంద్రం నాన్చుడు ధోరణిని అనుసరించింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ఎలా ముందుకెళ్తారంటూ పలు ద ఫాలుగా నోటీసులు జారీ చేస్తూ పనులు నిలిచేలా చేసింది. అసలు పర్యావరణ అనుమతులు మీకు ఎవరు ఇచ్చారు? మా అనుమతులు తీసుకోకుండానే యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించేసుకుంటారా? అంటూ సవాలక్ష ప్రశ్నలు సంధిస్తూ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయకుండా అడ్డు పడుతూ వచ్చింది.

పర్యావరణ అనుమతుల విషయంలో తమ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు 9 మాసాల సమయం ఇస్తామంటూ రాష్ట్ర విద్యుత్ శాఖకు లేఖ రాసింది. కేంద్ర సర్కారు లేఖలకు సమాధానాలు చెబుతూనే ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పనులు సాగుతున్న తీరును నిరంతరం సమీక్షించుకుంటూ వచ్చారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయించండంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించడంతో ఇటీవల బిహెచ్‌ఈఎల్, టిఎస్ జెన్‌కో అధికారులతో ఇటీవల ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో టిఎస్ ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి 5 x 800 మెగావాట్ల యాదాద్రి ప్లాంట్ పురోగతితో పాటు 4 x 270 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పెండింగ్ పనులను కూడా ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. ముఖ్యంగా యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లోని కూలింగ్ టవర్లు, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ పనులు కాస్త నిలకడగా సాగుతున్నాయి.
అతిపెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రాలలో మొదటిది ఇదే
ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రభుత్వ రంగంలో నిర్మిస్తున్న అతిపెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రాలలో కాగా దేశంలో ప్రభుత్వ రంగంలో నిర్మిస్తున్న అతిపెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రాలలో ఇది మొదటిది కానుండడం విశేషం. 48 నెలల్లో నిర్మించి విద్యుదుత్పత్తిని జెన్‌కో ప్రారంభిస్తోంది. గతంలో భద్రాద్రి జిల్లా బయ్యారం వద్ద 1080 మెగావాట్ల స్థాపిత సామర్ధంతో మరో ప్లాంటును భద్రాద్రి పేరుతో చేపట్టి ఉత్పత్తి ప్రారంభించింది. ఈ వరుసలో మూడో ప్లాంటు యాదాద్రి పేరుతో దామొరచెర్ల వద్ద చేపట్టింది. దీని నిర్మాణాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇది పూర్తయితే రాష్ట్ర అవసరాలకు గాను కరెంటు కొరత ఉండదని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2023 డిసెంబర్ నాటికల్లా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. కాగా ఈ లోగానే యాదాద్రి ప్లాంటులో విద్యుదుత్పత్తి ప్రారంభించి రాష్ట్రానికి వెలుగులు పంచాలని సిఎం కెసిఆర్ జెన్‌కోకు సూచించారు.

కాగా నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించడానికి ఈ నెల 28వ తేదీన వస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పడంతో జెన్‌కో అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వెంట రాష్ట్ర మంత్రులు , ఎంఎల్‌ఏలు అలాగే చీఫ్ సెక్రటరీ కూడా వచ్చే అవకాశం ఉందని ప్లాంటు ఆవరణలో రెండు హెలీప్యాడ్లను ఇప్పటికే సిద్ధం చేశారు. రాష్ట్ర అవసరాలకు యాదాద్రి విద్యుత్ కేంద్రం కీలకమని , దీని నిర్మాణ పనులను రాత్రింబవళ్లు పదివేల మంది కార్మికులు శర వేగంగా చేస్తున్నట్లు జెన్‌కో , అలాగే ట్రాన్స్‌కోల సిఎండి దేవులపల్లి ప్రభాకర రావు చెబుతున్నారు. దీనికి ఇచ్చిన పర్యావరణ అనుమతిని సమీక్షించి తిరిగి నివేదిక ఇవ్వాలని కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన ఆదేశాలు నిర్మాణానికి ఆటంకం కావాని ఆయన స్పష్టం చేశారు. నిర్మాణం ఆపాలని ఎన్టీటి కూడా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెబుతున్నారు.
అమ్రాబాద్ అభయారణ్యానికి కేంద్రం లింక్ !!
కాగా ఒక పక్క నిధుల పరంగా కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ, దానికి తోడు కేంద్ర పర్యావరణ శాఖ పెడుతున్న కొర్రీలతో పనులు వేగంగా సాగని పరిస్థితి నెలకొంది. యాదాద్రి పేరుతో దామెరచెర్ల వద్ద చేపట్టిన యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రానికి ఇచ్చిన పర్యావరణ అనుమతిపై మరో సారి అధ్యయనం చేయాలని కేంద్ర పర్యావరణ శాఖ రాష్ట్ర అటవీశాఖను ఆదేశించింది. ఈ అధ్యయనాన్ని తొమ్మిది నెలల్లోనే పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కోరడం గమనార్హం. మరీ ముఖ్యంగా అమ్రాబాద్ అభయారణ్యానికి ఈ యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం నిర్మించే స్థలం సుమారుగా ఎంత దూరంలో ఉందన్న అంశాన్ని నిర్ధారించి చెప్పాలని తెలిపింది. పది కిలోమీటర్ల దూరంలోపు ఉంటే వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. కాగా ఇటీవల జరిగిన పర్యావరణ సమీక్ష కమిటీ సమావేశంలో యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రంపై చర్చించినట్లు తెలియజేసింది.

రూ. 29,990 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టులో సుమారుగా 80 శాతం వరకు పనులు పూర్తయ్యాయని కేంద్ర పర్యావరణ శాఖకు జెన్ కో తెలియజేయడం గమనార్హం. దేశంలో ప్రభుత్వ రంగంలో నిర్మిస్తున్న అతిపెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రాలలో ఇది మొదటిది కానుండడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శ్రీశైలం తరహాలో నీటి లభ్యత అంతగాలేక పోవడంతో థర్మల్ విద్యుత్తు ఉత్పత్తిపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కేంద్రీకరించింది. దాదాపుగా ఒకే స్థలంలో సుమారుగా మూడు నుంచి నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ సామర్ధంతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటును నిర్మించనున్నారు. నల్లొండ జిల్లా దామెర చెర్ల వద్ద నిర్మిస్తున్న ఈ కేంద్రం నిర్మాణ పనుల టెండరును బెల్ సంస్థ దక్కించుకున్నట్లు చెబుతున్నారు. మొత్తం రూ. 29,990 కోట్ల నిర్మాణ అంచనా వ్యయంతో చేపట్టిన ఈ కేంద్రంలో 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి స్థాపిత స్థామర్యంతో మొత్తం 5 ప్లాంట్లుగా ఏర్పాటు కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News