Sunday, January 19, 2025

భద్రకాళి చెరువుకు గండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ :గోదావరి పరివాహంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలను నిలువునా నీట ముంచిన భారీ వర్షాలు వరదలు ఘోర దృశ్యాలను మిగిల్చాయి. వర్షం తెరిపినిచ్చి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో గుట్టకొకరు చెట్టుకోకరుగా పరుగులు తీసి ప్రాణాలు దక్కించికున్న వారంతా మెల్లగా ఇళ్లకు చేరుకుంటున్నారు. వరద నీటిలో కొట్టుకుపోయిన వారి మృత దేహాలు కూడా ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. బురద కొట్టుకుని గుర్తు పట్టలేంతగా ఉన్న ఈ మృతదేహాలను కుటుంబ సభ్యులు తడిడి తడిమి చూసుకుంటూ ఆనవాళ్లతో పొల్చుకుంటూ తమవారే అని నిర్ధారింకుని బోరున విలపిస్తున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు వరద వల్ల ఇప్పటివరకూ మృతి చెందిన వారి సంఖ్య 19కి చేరింది. అందులో అత్యధికులు జంపన్న వాగులో గల్లంతైన వారే. కొండాయిలో ఏకంగా ఎనిమిది మంది జల సమాధి అయ్యారు.

కొత్తగా నిర్మించిన కల్వర్టువద్ద రోడ్డు వరదనీటి ఉధృతికి గుంతపడింది అయితే ఆ మార్గంలో వెళ్తున్న వారు రోడ్డు మీదే వెళ్తున్నామన్న భావనతో ముందుకు సాగుతుండగా నీట మునిగివున్న గుంతలో పడి నిలదొక్కుకోలేక వరదనీటి ఉధృతికి వాగులో కొట్టుకుపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నీటిగుంత వారి పాలిట మృత్యుబిలంగా మారి ఎనిమిది మంది నిండు ప్రాణాలు తీసింది.. భారీ వరదలతో కొట్టుకు పొయిన మరో మహిళ మృతదేహాన్ని శనివారం గుర్తించారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామం వరదల్లో గల్లంతైన గంగడి సరోజగా నిర్ధారించారు. వరదనీటిలో మునకేసిన కాలనీలు ఇప్పడిప్పుడే ఒడ్డున పడుతున్నాయి. కాలనీల్లో రోడ్ల వెంట మోకాలెత్తున ఒండ్రుమట్టి పేరుకుపోయింది. అన్నింటిని భరించి ఇళ్లకు చేరిన వరద బాధితులకు ఇంటిని చూడగానే కన్నీరు కట్టలు తెంచుకుంటోంది.

ఇళ్లంతా బురద మట్టి పేరుకుపోయి కనిపిస్తోంది. ఇళ్లలో ఉన్న సరుకు సామగ్రిలో చాలమటుకు వరదనీటిలో కొట్టుకు పోయింది. మిగిలిన సామగ్రి కూడా బురదనీటిలో తడిసి కుళ్లి కంపుకొడుతూ ఎందుకు పనికిరాకుండా పొయింది. ఫ్రీజ్‌లు , టివీలలోకి వరదనీరు ప్రవేశించి అవి ఎందుకు పనికిరాకుండా పోయాయి. నీటనానిన ఇళ్లన్ని నీచు కంపు కొడుతున్నాయి. ఇంకా ఇళ్లలో ఎదో మిగిలి ఉండకపోతుందా అన్న కొద్దిపాటి ఆశలు కూడా ఆవిరైపోతున్నాయి. గ్రామాల్లో కిరాణా షాపులను కూడా వరదనీరు ముంచెత్తింది. వరదతాడికి నుంచి సరుకులను కాపాడుకునేందుకు షెట్లర్లు వేసి తాళం వేసినప్పటికీ షాపుల్లోకి నీటి చేరికతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. షాపులో ఉన్న అన్ని రకాల సామాగ్రి తడిసి ముద్దయింది. మోరంచపల్లికో ,మరో కొండాయికొ ఇటువంటి దృశ్యాలు పరిమితం కాలేదు. గోదావరీ నదీపరివాహకంగా ఉన్న ఉత్తర తెలంగాణలోని వరదనీట మునిగిని గ్రామాలు , కాలనీల పరిస్థితులు ఆదే విధంగా ఉన్నాయి.

వరద గుప్పిట్లో భద్రాచలం ..పునరావాసాలకు జనం
గోదావరి నదిలో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. భద్రాచలం వద్ద నదిలో నీటిమట్టం సాయంత్రానికి 55 అడుగులకు పెరిగింది. ఇప్పటికే అక్కడ మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదనీటిని దృష్టిలో ఉంచుకుని నదిలో నీటిమట్టం 60అడుగులకు పెరినా పరిస్థితిని ఎదుర్కొనేందుకు కలెక్టర్ ప్రియాంక అధికార యంత్రాంగాని సిద్ధ్దం చేస్తున్నారు. పడవలు , మరబోట్లు, గజ ఈతగాళ్లు, , అవసరమైనన్ని లైఫ్ జాకెట్లు, సిద్ధం చేస్తున్నారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు ఇప్పటికే భద్రాచలం వద్ద మొహరించి ఉన్నాయి.

విపత్కర పరిస్థితుల్లో బాధితులను కాపాడేందుకు భారత వై మానిక దళానికి చెందిన ఒక హెలికాప్టర్‌ను కూడా అందుబాటులో ఉంచారు. నదిలో పెరుగుతున్న నీటిమట్టం ఆధారంగా కాంటూర్ లెవెల్స్‌ను గుర్తించి లో తట్టు ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు. వరదనీరు సమీపిస్తున్న ప్రాంతాల్లోని వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించి పునరావాస శిబిరాలకు తరలిస్తున్నా రు. ఇప్పటివరకూ భద్రాచలం పరిసరాల్లో 40పునరావాస కేంద్రాలు ఏర్పటు చేశారు. సుమారు 5వేలమందని ఈ శిబిరాలకు తరలించారు.
ప్రమాదపు అంచుల్లో విలీన మండలాలు
గోదావరి నదిలో వరద నీటి ఉధృతి పెరుగుతుండటంతో వీలీన మండలాల్లోని పలు ప్రాంతాలు ప్రమాదపు అంచుల్లోకి చేరుతున్నాయి. చర్ల,దుమ్ముగూడెం మండలాలు వరదగుప్పిట్లో చిక్కిపోయాయి. పలు గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. పురుషోత్తమపట్నం రహదారి నీటమునిగింది. తెలంగాణలో భద్రాలచం నుంచి అటు ఒడిశా, చత్తీస్‌గఢ్ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లేందుకు ఇదే ఏకైక మార్గం కావటంతో ఈ రాష్టాలకు తెలంగాణతో రాకపోకలు నిలిచిపోయాయి.
భద్రాకాళి చెరువుకు గండి
ఓరుగల్లు నగరం ఇంకా వరదల ప్రభావం నుంచి బయటకు రాలేకపోతోంది. పలు కాలనీలు ఇంకా వరదనీటిలోనే ఉన్నాయి. వరంగల్ మహానగరానికి తాగునీటిని అందించే భద్రకాళి చెరువుకు గండి పడింది. పోతన నగర్, సరస్వతి నగర్, రంగంపేట, కాపువాడ తదితర లోతట్టు ప్రాంతాలకు మళ్లీవరద ముంపు భయం పట్టుకుంది. అదికార యంత్రాగం యుద్ధప్రాతిపదికన గండి పూడ్చివేతకు చర్యలు తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News