Saturday, December 21, 2024

వరుడి వినూత్న ఆలోచన…. జ్ఞానాన్ని పెంచే నిశ్చితార్థ వేడుక

- Advertisement -
- Advertisement -

వరుడి వినూత్న ఆలోచన: తన ప్రేమకు సరి తూగు జ్ఞానాన్ని పంచి నిశ్చితార్థ వేడుక.

మంచిర్యాల బ్యూరో: ఎప్పుడు సందడిగా ఉండే మన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎంఎన్ఆర్ గార్డెన్ లో ప్రశాంత్ వర్మ, తేజస్విలు ఇటీవల తమ నిశ్చితార్థపు ప్రేమ ఉంగరాలను మార్చుకోవటమే కాకుండా వధువు బరువుకు సమానమైన భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేయడం ద్వారా జరుపుకున్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ, చేసేలా ప్రోత్సాహం అందిస్తూ రాష్ట్రస్థాయి అవార్డులు, ఉత్తమ రైతు పురస్కారాలు సాధించి, సమాజసేవలో ఎప్పుడు ముందుంటూ. మనిషి ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి చేరుకోవాలంటే అది యోగా సాధన, ఆధ్యాత్మిక ద్వారానే సాధ్యమని గుర్తించి, గత 23 సంవత్సరాలుగా యోగ సాధనలో ఉంటూ ఎంతో మందికి యోగా పరిచయం చేస్తున్న ఎంబడి కిషన్ పద్మల చిన్న అబ్బాయి ప్రశాంత్ వర్మ
అగ్రికల్చర్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రస్తుతం సిటిఆర్ఐ, రాజమండ్రిలో సీనియర్ రీసెర్చ్ ఫెలోగా విధులు నిర్వహిస్తూ తన జీవిత ఆశయాలను చేరుకోవటానికి తోడుగా అగ్రికల్చర్ లోనే గ్రాడ్యుయేషన్ చేసి తన లాంటి భావాలు కలిగిన తేజస్విని జీవిత భాగస్వామిగా ఎన్నుకున్నారు.

వారి నిశ్చయ తాంబూల కార్యక్రమంలో మామూలుగా వచ్చిన వారికి వాయినం ఇవ్వడం ఆనవాయితీ కానీ వీరు వాయునంతో ఇవ్వటంతో పాటు ఏదైనా సమాజానికి ఉపయోగపడేటట్టుగా మంచి కార్యక్రమం చేయాలని తలచి సమాజంలో మంచి పెరగాలని, పెరగాలంటే మార్పు మనుషులు లోపలి నుండి మొదలవాలని కొన్ని వేల సంవత్సరాల క్రితం బోధింపబడినప్పటికీ ఇప్పటికీ మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రశ్నలకు జవాబులు అందించి, మనకి కర్తవ్యం, ధర్మం మరియు ఆధ్యాత్మిక జ్ఞానానికి మార్గాన్ని సూచిస్తూ నైతిక మరియు సమతుల్య జీవిత సాధనకై అమూల్యమైన బోధనలను అందిస్తూ మరియు ఆధ్యాత్మికంగా స్థూలంగా ఉంటూనే జీవితంలోని సవాళ్లు మరియు భాద్యతలను ఎలా నావిగేట్ చేయాలనే దాన్ని వివరించే కాలాతీతమైన జ్ఞానసంపద అయినటువంటి భగవద్గీత అందరూ చదవాలని,పెరుగుతున్న భౌతిక ప్రపంచంలో, యువ మనస్సులు వారి ఆధ్యాత్మిక శ్రేయస్సును పట్టించుకోవడం లేదని, భగవద్గీత బోధనలు ఆత్మపరిశీలన మరియు స్వీయ- అన్వేషణను ప్రోత్సహిస్తాయని.

ఈ గీతా బోధనల ద్వారా, నేటి యువత జీవితపు ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలను వెతుకుతూ అర్థవంతమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించాలని, భగవద్గీతను కనీసం తన దగ్గరి వారికైనా చేరువ చేయాలన్న ప్రశాంత్ వర్మ ఆలోచనలకు కుటుంబం కూడా తోడవడంతో గోరఖ్పూర్ నుండి ఆర్డర్ పెట్టి రాజమండ్రి లోని ఒక ప్రైవేట్ షాప్ లో పెళ్లి పత్రిక, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వివాహ వేదిక ముహూర్తం, వధూవరుల వివరాలు వచ్చేలా గీతా పుస్తకంలో ముద్రించడం జరిగింది. భౌతిక వాదానికి తరచుగా ప్రాధాన్యతను ఇచ్చే కాలంలో వారి ప్రేమకు గుర్తుగా గీతా పుస్తకాలు పంపిణీ ద్వారా జ్ఞానం, నీతి, ఆధ్యాత్మికత, ప్రాముఖ్యతను గురించి నేటితరం ఆలోచించేలా ప్రోత్సహిస్తుందని, వీరు ఇలా ఇవ్వటం, నిశ్చితార్థ మహోత్సవానికి సమానంగా వధువు తులాభార కార్యక్రమం నిర్వహించిన విధానం చాలా అద్భుతంగా ఉందని ఇక ముందు కూడా ఇలాంటివి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాల్సిన అవసరం ఉందని కార్యక్రమంలో పాల్గొన్న బంధువులు ఆనందం వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News