- Advertisement -
ఢిల్లీ: యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో భగవద్గీతకు చోటు దక్కిందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. భగవద్గీతతో పాటు భరతముని రాసిన నాట్యశాస్త్రానికి కూడా యునెస్కో గుర్తింపు పొందడంపై హర్షం వ్యక్తం చేశారు. భగవద్గీతకు యునెస్కో గుర్తింపు దక్కడంపై మోడీ స్పందించారు. భారతీయుల గొప్ప సంస్కృతి, జ్ఞానానికి గుర్తింపు దక్కిందన్నారు. భగవద్గీత, నాట్యశాస్త్రం శతాబ్దాలుగా నాగరికతను, చైతన్యాన్ని పెంపొందించాయని, వారి అంతర్దృష్టులు ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని తెలియజేశారు. ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
- Advertisement -