Wednesday, January 22, 2025

ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు

- Advertisement -
- Advertisement -

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా శ్రీలీల కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ లో దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, అభిమానులు, ప్రేక్షకులు, విమర్శకులందరి ప్రశంశలు అందుకొని అఖండ విజయం సాధించింది. ‘భగవంత్ కేసరి’ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది

ప్రెస్ మీట్ లో శ్రీలీల మాట్లాడుతూ..భగవంత్ కేసరి విజయం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాతో నన్ను చూసే విధానం మారింది. ఇంత చక్కని పాత్ర ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి గారికి ధన్యవాదాలు. బాలకృష్ణ గారి సినిమాలో ఒక అమ్మాయికి ఫైట్ చేసే అవకాశం రావడం మామూలు విషయం కాదు. ఆయన దగ్గర వుండి ఎంతో గొప్పగా ప్రోత్సహించారు. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు. ఎమోషనల్ సీన్స్ కి అందరూ గొప్పగా కనెక్ట్ అవుతున్నారు. విజ్జి పాపకు చిచ్చా వున్నట్లు మా సినిమాకి ప్రేక్షకులు వున్నారు. ఇంత మంచి కంటెంట్ ని అంతే గొప్పగా ఆదరిస్తున్నారు. ఫ్యామిలీ అంతా కలసి సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులు ధన్యవాదాలు” తెలిపారు.

దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఈ చిత్రం ప్రమోషన్స్ మొదలుపెట్టినప్పటి నుంచి ఒకే మాట చెప్పాం. ”ఈ సినిమా శానా యేండ్లు యాదుంటాది”అని. అది ఈ రోజు నిజం చేశారు. చాలా సంతోషంగా వుంది. ఒక దర్శకుడిగా ‘భగవంత్ కేసరి’ సంపూర్ణమైన తృప్తిని ఇచ్చింది. అన్ని వైపుల నుంచి చాలా అద్భుతమైన స్పందన వస్తోంది. సినిమాలో చూపించిన హ్యూమన్ ఎమోషన్స్, తండ్రి బిడ్డ మధ్య అనుబంధానికి ప్రేక్షకులు చాల బాగా కనెక్ట్ అయ్యారు. ఆడపిల్లని సింహాలా పెంచాలనే ఒక మంచి కంటెంట్ జనాల్లోకి వెళ్ళింది.

బాలకృష్ణ గారు తన కంఫర్ట్ జోన్ ని దాటి స్త్రీ సాధికారత గురించి వున్న ఈ కథని చేశారు. బాలకృష్ణ గారికి నిజంగా హ్యట్సప్. బాలకృష్ణ గారి నటన గురించి అందరూ గొప్పగా మాట్లాడుతున్నారు. ఈ సినిమాతో ఆయన హీరోగా మరింత ఎత్తుకు ఎదిగారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన బాలకృష్ణ గారి ధన్యవాదులు. శ్రీలీల విజ్జి పాపగా అద్భుతంగా నటించింది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకొని ఎక్స్ ట్రార్డినరీ గా చేసింది. ఆ ఎపిసోడ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. సినిమాని చాలా గొప్పగా ఆదరించారు. ఇది ఆరంభం మాత్రమే. దసరా మరో పది రోజులు వుంది. క్లీన్ రన్ దొరుకుతుంది. ముందుముందు ఇంకా మట్లాడుకుందాం. ఇంత గొప్పగా ఆదరించి, ఇంత పెద్ద ఘనవిజయాన్ని ఇచ్చిన  ప్రేక్షకులు ధన్యవాదాలు. బాలకృష్ణ గారితో కలిసి మరో పెద్ద ఈవెంట్ ని నిర్వహించబోతున్నాం. భగవంత్ కేసరి వేడుకలు జరుగుతూనే వుంటాయి’ అన్నారు.

నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. ఇంత అద్భుతమైన పాత్ర చేసి మాకు ఇంత గొప్ప సినిమా ఇచ్చిన బాలకృష్ణ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు” తెలిపారు.

అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘భగవంత్ కేసరి’కి ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇందులో ఉయ్యాల ఉయ్యాల పాట రాయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒకే సినిమా ద్వారా అటు జాతీయ రికార్డులు, ఇటు జాతీయ అవార్డులు అందుకుంటున్న చిత్రం భగవంత్ కేసరి. ఇందులో ఎలాంటి సందేహం లేదు.’అన్నారు

రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ..’భగవంత్ కేసరి’ సినిమా చూస్తున్నపుడు చాలా సార్లు గూస్ బంప్స్ వచ్చాయి. బాలకృష్ణ గారి నటన అత్యద్భుతం. ఈ సినిమాకి అన్నీ అద్భుతంగా కుదిరాయి. అనిల్ లో చాలా వైవిధ్యం వుంది. అది ఈ సినిమాతో బయటపడింది. శ్రీలీల తన పాత్రలో పూర్తి పరకాయప్రవేశం చేసింది. తమన్ చాలా చక్కని సంగీతం చేశారు. మంచి పాటలు రాయించుకున్నారు అనిల్. సినిమా యూనిట్ అందరికీ అభినందనలు. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది”  అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News