Thursday, December 19, 2024

పంచభక్ష పరమాన్నాలు ఉన్న ‘భగవంత్ కేసరి’

- Advertisement -
- Advertisement -

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి’. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోషిస్తున్నారు. భగవంత్ కేసరి సినిమా దసరా కానుకగా ఈనెల 19న విడుదల కానున్న నేపధ్యంలో హన్మకొండలో ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్‌గా నిర్వహించారు. దర్శకులు వంశీపైడిపల్లి, గోపీచంద్ మలినేని, బాబీ ఈ వేడుకకు ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. “అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి లాంటి సరైన సినిమా దొరికింది. బాలకృష్ణ సినిమా అంటే పంచభక్ష పరమాన్నాలు వున్న భోజనంలా అన్నీ వుండాలి. ఇందులో కూడా అన్నీ వుంటాయి. మొత్తంగా డిఫరెంట్ సినిమా ఇది. దసరాకి ముందు డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాం”అని తెలిపారు.

దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ “భగవంత్ కేసరి సినిమా నా కెరీర్‌లో శానా యేండ్లు యాదుంటుంది. కాజల్ ఇందులో చాలా మంచి పాత్ర చేశారు. శ్రీలీల చేసిన విజ్జి పాప రోల్ చాలా రోజులు గుర్తుండిపోతుంది. బాలకృష్ణతో ఈ సినిమా జర్నీ ఎప్పటికీ మరచిపోలేనిది”అని అన్నారు. కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ “ఈ సినిమా నాకు చాలా స్పెషల్. గ్రేట్ లెజెండ్ బాలయ్యతో వర్క్ చేయడం గౌరవంగా భావిస్తున్నాను”అని పేర్కొన్నారు. ఈ వేడుకలో హీరోయిన్ శ్రీలీల, నిర్మాత సాహూ గారపాటి, మురళీధర్, రచ్చ రవి, జాన్ విజయ్, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News