Thursday, January 23, 2025

దసరాకి బాలయ్య బాబు దుమ్ము దులుపుతారు

- Advertisement -
- Advertisement -

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి’. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా శ్రీలీల కీలక పాత్ర పోషించింది. భగవంత్ కేసరి సినిమా దసరా కానుకగా ఈనెల 19న విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్ గ్రాండ్ ప్రెస్ మీట్‌ని నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. దుర్గమ్మ వారి నవరాత్రులు జరుపుకుంటున్న ఈ తరుణంలో నా 108 చిత్రంగా భగవంత్ కేసరి ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది. దుర్గ అంటే స్త్రీ శక్తి. ఈ సినిమా కథ కూడా స్త్రీ శక్తికి సంబధించినదే. దుర్గమ్మ వాహనం పులి. ఈ సినిమాలో కూడా అమ్మాయిని పులిలా పెంచాలనే మాట వుంది. అలాగే సినిమా పేరు కూడా భగవంతుడితో మొదలైయింది. నేలకొండ భగవంత్ కేసరి హై ఎనర్జీతో వుంటుంది. అనిల్ రావిపూడి ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. భగవంత్ కేసరి సినిమా అందరికీ గుర్తుండిపోతుంది’ అని తెలిపారు.

దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘నవ్వించేవాడికి ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయని అంటారు. ఇది వరకు సినిమాలతో నవ్వించిన వాడు ఈసారి కొం చెం ఎమోషన్ చూపించబోతున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ, శ్రీలీల అద్భుతంగా నటించారు. వారి పాత్రలు చాలా రోజులు గు ర్తుపెట్టుకునేలా వుంటాయి’ అని అన్నారు. నిర్మాత సాహు గారపా టి మాట్లాడుతూ.. ‘దసరాకి బాలయ్య బాబు ఈ సినిమాతో దు మ్ము దులుపుతారు. ఈ సినిమా అభిమానులు, ఫ్యామిలీ ఆడియ న్స్ అందరినీ అలరిస్తుంది’ అని qన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీలీ ల, ఎస్‌ఎస్ తమన్, నిర్మాత హరీష్ పెద్ది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News