- Advertisement -
నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘భగవంత్ కేసరి’. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ఫస్ట్ లుక్స్, సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఆదివారం సాయంత్రం హన్మకొండలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేశారు. పవర్ ఫుల్ డైలాగ్స్, ఫ్యామిలీ సెంటిమెంట్, మాస్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ మూవీపై భారీ అంచనాలు పెంచేసింది. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీలా, కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కాగా, ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
- Advertisement -