Wednesday, January 22, 2025

‘భగవంత్ కేసరి’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్..

- Advertisement -
- Advertisement -

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భగవంత్ కేసరి’.  ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీలా, కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ఫస్ట్ లుక్స్, సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ కు మేకర్స్ టైమ్ ఫిక్స్ చేశారు.

ఈ రోజు సాయంత్రం 8.16 గంటలకు ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.  ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కాగా, ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News