న్యూఢిల్లీ: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి సందర్భంగా ప్రభుత్వం రూ. 100 స్మారక నాణేలను ప్రభుత్వం విడుదల చేయబోతున్నది. దీనికి సంబంధించి ఏప్రిల్ 22 నాటి గెజిట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీచేసింది. భగవాన్ సత్యసాయిబాబా ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి గ్రామంలో 1926 నవంబర్ 23న జన్మించారు. ఆయన తన 14వ ఏటనే దైవిక లక్ష్యాన్ని ఆరంభించారు.
‘బాబా అన్ని మతాల ఐక్యతను నొక్కిచెప్పారు. సత్యం, సత్ప్రవర్తన, శాంతి, ప్రేమ, అహింస అనే మానవ విలువలను బోధించారు’ అని ఓ అధికారి తెలిపారు. రూ. 100 నాణెంపై ఒక ప్రక్క అశోక స్థూపం, దానిపై సత్యమేవ జయతే అని రాసి ఉండడం, దేవనగర లిపిలో ‘భారత్’ అని, ఇంగ్లీష్‌లో ‘ఇండియా’ అని ఒక వైపు ఉంటే, మరో వైపు నాణెం మధ్యలో ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ అని, ఎడమవైపు 1926వ సంవత్సరం, కుడివైపు 2026వ సంవత్సరం ఉంటాయి. నాణెం పైభాగాన హిందీలో ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా కీ జన్మ శతాబ్ది’ అని ఉంటుంది.