Wednesday, January 22, 2025

పాట చిత్రీకరణలో ‘భగవంత్ కేసరి’..

- Advertisement -
- Advertisement -

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల క్రేజీ ప్రాజెక్ట్ ‘భగవంత్ కేసరి’. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది విడుదలయ్యే భారీ అంచనాల సినిమాలలో ఒకటి. ప్రస్తుతం ’భగవంత్ కేసరి’ షూటింగ్ హైదరాబాద్ ఆర్‌ఎఫ్‌సిలో వేసిన భారీ సెట్‌లో జరుగుతోంది. బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల ప్రధాన తారాగణంపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు.

భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ప్రధాన తారాగణం అంతా కనిపించబోయే ఈ పాటను బిగ్ స్క్రీన్స్ పై చూడటం కన్నుల పండువగా ఉంటుంది. ’భగవంత్ కేసరి’ యునిక్ కాన్సెప్ట్‌తో హై యాక్షన్‌గా వుంటుంది. బాలకృష్ణను మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో అనిల్ రావిపూడి చూపిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి సినిమా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News