- Advertisement -
చండీగఢ్ : పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో ఆమ్‌ఆద్మీ మరింత యాక్టివ్ అయింది. సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్‌ను కేజ్రీవాల్ ప్రకటించారు. పబ్లిక్ పల్స్ ప్రకారం ఈ ఎంపిక జరిగింది. దీంతో ఆప్ మరింత దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, ఆప్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఆప్ సిఎం అభ్యర్థి భగవంత్ మాన్ కాంగ్రెస్ సిఎం చెన్నీకి సవాలు విసిరారు. దమ్ముంటే ధురీ నుంచి తనపై పోటీ లోకి దిగాలని సవాల్ చేశారు. సీఎం చెన్నీ నియోజక వర్గం చమ్‌కౌర్ సాహిబ్ నుంచి తాను బరిలోకి దిగలేనని, ఎందుకంటే అది రిజర్వుడు స్థానం అని, అందువల్ల ధురీ నుంచి చెన్నీ బరి లోకి దిగవచ్చని వ్యాఖ్యానించారు.
- Advertisement -