Wednesday, January 22, 2025

మాన్ రాకతో సిద్ధూ గ్రామంలో భారీ బందోబస్తు

- Advertisement -
- Advertisement -

Bhagwant Mann assures justice to Sidhu Moosewala’s family

మాన్సా: ఇటీవల హత్యకు గురైన పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా కుటుంబాన్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సిద్ధూ స్వగ్రామం మాసాకు రానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు గ్రామంలోకి ఎవరినీ రానివ్వకుండా అడ్డుకోవడంపై కొందరు వ్యక్తులు నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి మాన్ శుక్రవారం మూసా గ్రామాన్ని సందర్శించగా అంతకు ముందు కొందరు గ్రామస్తులు తమ రాకను పోలీసులు అడ్డుకోవడంపై నిరసన తెలిపారు. కాగా..మూసా గ్రామంలోకి రాకుండా తాము ఎవరినీ అడ్డుకోవడం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు ముందు సిద్ధూ ఇంటికి వచ్చిన ఆప్ ఎమ్మెల్యే గురుప్రీత్ సింగ్‌కు కూడా గ్రామస్తుల నుంచి నిరసన వ్యక్తమైంది. గ్రామం బయట తమ కార్లను అడ్డుకుంటున్నారని, తమ బంధువులను గ్రామంలోకి రానివ్వడం లేదని ఒక గ్రామస్తుడు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News