Sunday, January 19, 2025

హైదరాబాద్ కు రానున్న పంజాబ్ ముఖ్యమంత్రి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: మంగళవారం పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ హైదరాబాద్ కు రానున్నారు‌. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతో భగవంత్ మాన్ భేటీ కానున్నారు. ప్రస్తుత రాజకీయాలతోపాటు పలు అంశాలపై వారు చర్చించనున్నారు. ఆ తర్వాత పంజాబ్‌ సిఎం పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ఫిబ్రవరిలో పంజాబ్‌లోని మొహాలిలో జరిగే ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా కెసిఆర్ ను ఆహ్వానించనున్నారు.

24న పంజాబ్‌ స్పీకర్‌ రాక

పంజాబ్‌ శాసనసభ స్పీకర్‌ సర్దార్‌ కుల్తార్‌సింగ్‌ సంధ్వాన్‌ ఈ నెల 24న తెలంగాణకు రానున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ స్పీకర్‌ జైకిషన్‌ సింగ్‌ రౌరీ, రాజ్యసభ సభ్యుడు విక్రమ్‌జీత్‌ సింగ్‌ సాహ్ని, ఎమ్మెల్యే కుల్వంత్‌ సింగ్‌ పండోరి, మరో ఇద్దరు కూడా హైదరాబాద్‌కు రానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News