Wednesday, January 22, 2025

సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాసరావు భార్య భాగ్యలక్ష్మి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అటవీ రక్షణలో తన విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాసరావు భార్య భాగ్యలక్ష్మికి ఈ మేరకు డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇచ్చారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సోమవారం హరితహారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులో జరిగిన సభా వేదిక మీదనే అందించారు.

ఈ సందర్భంగా రేంజర్ శ్రీనివాసరావు భార్య భాగ్యలక్ష్మిమీడియాతో మాట్లాడుతూ పెద్ద దిక్కును కోల్పోయిన మాకు కుటుంబ పెద్దగా, ఓ తండ్రి లాగా ముఖ్యమంత్రి కెసిఆర్ అండగా నిలిచి తమను ఆదుకున్నారన్నారు. ప్రభుత్వ పరంగా తమకు ఇప్పటికే ఇంటి స్థలం, ఆర్థిక సహాయం చేశారని, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చారని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News