Wednesday, February 5, 2025

పతాకధారులుగా భాగ్యశ్రీ, సుమిత్ అంతిల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మకమైన పారా ఒలింపిక్స్ ఆరంభోత్సవ వేడుకల్లో భారత పతాకధారులుగా షాట్‌పుట్ క్రీడాకారిణి భాగ్యశ్రీ జాదవ్, స్టార్ జావెలియన్ త్రో ఆటగాడు సుమిత్ అంతిల్ వ్యవహరిస్తారు. ఆగస్టు 28 నుంచి పారిస్ వేదికగా పారాలింపిక్స్ జరుగనున్నాయి. దీని కోసం 84 మంది కూడిన బృందాన్ని భారత్ బరిలో దించుతోంది. పారాలింపిక్స్ ఆరంభ వేడుకల్లో భాగ్యశ్రీ, సుమిత్ పతాకధారులుగా వ్యవహరించనున్నారు.

షాట్‌పుట్‌లో భాగ్యశ్రీ అత్యంత నిలకడైన ప్రదర్శనతో అలరిస్తోంది. ఇక జావెలిన్‌త్రో సుమిత్ ఇప్పటికే ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అంతేగాక టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం కూడా సాధించాడు. టోక్యోలో భారత్ ఐదు స్వర్ణాలు, 8 రజతాలు, మరో 6 కాంస పతకాలు సాధించి సత్తా చాటింది. ఈసారి పారిస్‌లో మరింత మెరుగైన ప్రదర్శతో అలరించాలని భావిస్తోంది. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, కనావో, సైక్లింగ్, బ్లైండ్ జూడో, పవర్ లిఫ్టింగ్, రోయింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టిటి తదితత క్రీడాంశాల్లో భారత ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News