ప్రభాస్ కొత్త సినిమా ప్రకటనకు సంబంధించి తెరవెనక జోరుగా కార్యక్రమాలు సాగుతున్నాయి. శివరాత్రి నాడే ప్రకటన వస్తుందని భావించినప్పటికీ అలా జరగలేదు. ఈ గ్యాప్‌లో టెస్ట్‌కట్స్ పూర్తి చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. మైథలాజికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రాబోతోంది. ఇప్పటికే ప్రభాస్‌పై టెస్ట్ షూట్ కూడా పూర్తయింది.
ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్‌ను ఫైనలైజ్ చేసేపనిలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం భాగ్యశ్రీ బోర్సేను ప్రభాస్ సరసన హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకుంటున్నారు. ఆమెపై కూడా తాజాగా టెస్ట్ షూట్ నిర్వహించారు. ఇలా అధికారికంగా ప్రకటించనప్పటికీ, బ్యాక్ గ్రౌండ్‌లో సినిమా పనులు జోరుగా సాగుతున్నాయి. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రామ్ లాంటి హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ సినిమాలో ఛాన్స్ అంటున్నారు.