మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ అప్ కమింగ్ సినిమాలోకి క్లాస్ మహారాణి వచ్చేసింది. ఈ మ్యాజికల్ మాస్ కాంబోలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటుస్తోంది.
తాజాగా విడుదలైన హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు అందరూ ఫిదా అవుతున్నారు. క్యారెక్టర్ ఇంట్రడక్షన్ పోస్టర్‌లో భాగ్యశ్రీ చాలా గ్లామరస్ గా వుంది. చీరలో చాలా క్లాసీగా, అందంగా కనిపిస్తున్నారు. ఈ చిత్రంతో భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. రవితేజ, భాగ్యశ్రీల క్లాస్, మాస్ కాంబినేషన్ మూవీని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.
రవితేజ, హరీష్ శంకర్ ముచ్చటగా మూడోసారి కలసి చేస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.