Thursday, February 20, 2025

మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన.. ‘మిస్టర్ బచ్చన్’ భామ

- Advertisement -
- Advertisement -

రవితేజ హీరోగా.. హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన భాగ్యశ్రీకి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. దీంతో ఈ సుందరి టాలీవుడ్‌లో ఆమె వరుస ఆఫర్లతో బిజీగా మారిపోయింది. తాజాగా ఈ భామ మరో క్రేజీ ఆఫర్ కొట్టినట్లు టాక్ వినిపిస్తుంది.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన నటించేందుకు భాగ్యశ్రీకి ఆఫర్ వచ్చినట్లు సమాచారం. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేస్తున్నారని ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది. ఈ సినిమా కోసం భాగ్యశ్రీని హీరోయిన్‌గా అడిగినట్లు తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి జివి ప్రకాశ్ సంగీతం అందించనున్నాడట. ఈ సినిమా ఈ ఏడాది మేలో పట్టాలెక్కనుందని టాక్.

ఇక భాగ్యశ్రీ ప్రస్తుతం సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వంలో దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కాంత’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాని రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్ఘీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అంతేకాక.. మహేశ్ దర్శకత్వంలో రామ్ పోతినేని 22 చిత్రంగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌లో భాగ్యశ్రీ నటిస్తుంది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వస్తున్న కింగ్‌డమ్ సినిమా కోసం ఈమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News