Saturday, November 23, 2024

భైరామలగూడ చెరువు కనబడడంలేదా ? సామ రంగారెడ్డి

- Advertisement -
- Advertisement -

ఎల్బీనగర్ : పట్టణ ప్రగతిలో భాగంగా భైరామలగూడ చెరువు కనబడడంలేదా రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి అని ప్రశ్నించారు ? ఎల్బీనగర్ చంద్రపురి కాలనీ భాజపా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ… చెరువు సుందరీకరణ ఎక్కడ ?అసలు చెరువు విస్తీర్ణం ఎంత? కబ్జా ఎంత అయిందో ఏమ్మేల్యే సుధీర్‌రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. చెరువులోకి డ్రైనేజీ నీరు నింపి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని ,ఇప్పటి వరకు చెరువు ఫెన్సీంగ్ చేసిన పరిస్దితి లేదని , బైరామలగూడ రెవిన్యూ పరిధిలో సర్వే నెంబర్ 24లో 13 గుంటల ప్రభుత్వ స్దలం ఉందని ,అట్టి స్దలాన్ని అనుచరులతో కలసి కబ్జా చేయలని యత్నిస్తున్నారని మండిపడ్డారు.

మిషన్ భగరీథ పథకం క్రింద 20000లీటర్లు నీళ్లు ఉచితంగా ఇస్తామని ,200 ,300 రూపాయలు వచ్చే నల్ల బిల్లుకు ఆధార్ లింక్ చేసుకుంటే త్రాగునీటి బిల్లు రాకుండా చేస్తామని ,తక్కువ మంచినీరు వాడేవారికి బిల్లులు ఉండవని ,ఇప్పుడు రూ.1600 ,1800లు వస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్‌ఆర్‌డిపీ ద్వారా మున్సిపాల్ కార్పోరేషన్‌కు ,రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఇచ్చి ఫ్లై ఓవర్లు ,అండర్ పాస్‌లు పనులు చేపడుతున్నారని తెలిపారు. బంజారహిల్స్ ,జూబ్లిహిల్స్ లాగా ఆస్తిపన్నులు వేసి ముక్కుపిండిగా వసూలు చేస్తున్నారని ,నకీలీ జీవో తీసుకు వచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. యానిమేష్‌న్ వీడియోలతో ప్రజలను మోసం చేస్తున్న ఎమ్మేల్యే సుధీర్‌రెడ్డిని తీరును బయట పెట్టి ప్రజలకు అవగావన కల్పించి ,కబ్జాలను బాగోతం పెడుతాం అని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో కృష్ణారెడ్డి ,కృష్ణంరాజు ,రవిశంకర్ ,రాజవర్దన్‌రెడ్డిలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News