Monday, January 20, 2025

ఆల్ టైమ్ క్లాసిక్ ‘భైరవద్వీపం’ 4కె ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

1974లో అద్భుతమైన అరంగేట్రం చేసిన నటసింహ నందమూరి బాలకృష్ణ సినీ పరిశ్రమలో 50 గ్లోరియస్ ఇయర్స్ పూర్తి చేసుకున్నారు. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి నటసింహ బాలకృష్ణ ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ “భైరవద్వీపం” ఈ తరం ప్రేక్షకులను అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. 1994లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ ఎవర్‌గ్రీన్ ఫాంటసీ ఎంటర్‌టైనర్…  క్లాప్ ఇన్ఫోటైన్‌మెంట్ ద్వారా గ్రాండ్‌గా రీ-రిలీజ్ అవుతోంది.

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, బాబీ (కెఎస్ రవీంద్ర),  గోపీచంద్ మలినేని రీ-రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. రావి కొండల రావు రాసిన మ్యాజికల్ స్టోరీకి మాధవపెద్ది సురేష్ అందించిన సంగీతం సినిమాకు మరో హైలైట్ నిలిచింది. ప్రేక్షకులకు మెమరబుల్ సినిమాటిక్ అనుభూతిని అందించి, బాక్సాఫీస్ వద్ద అద్భుతాలను సృష్టించిన ఈ చిత్రం.. అప్‌గ్రేడ్ చేసిన 4కె క్వాలిటీతో ఆగస్ట్ 30, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News