Saturday, December 21, 2024

పాలకొల్లులో ఆటా పాట

- Advertisement -
- Advertisement -

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ మోస్ట్ ఎవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పిస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మేకర్స్ పాలకొల్లులో సాంగ్ షూటింగ్ మొదలుపెట్టారు. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, హీరోయిన్ అదితి శంకర్‌పై క్యూట్ లవ్ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు. విజయ్ పోలాకి మాస్టర్ ఈ సాంగ్‌కి కొరియోగ్రఫీ చేస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల చార్ట్‌బస్టర్ ట్యూన్‌ని కంపోజ్ చేశారు. మేకర్స్ షేర్ చేసిన స్టిల్స్‌లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లుంగీ, షేడ్స్‌తో మాసీ అవాతార్‌లో, హీరోయిన్ అదితి శంకర్ పల్లెటూరి అమ్మాయిగా ఆకట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News