Monday, January 6, 2025

ఓ వెన్నెల సాంగ్ విడుదల

- Advertisement -
- Advertisement -

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మం చు మనోజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘భైర వం’ ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచా యి. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై కథానాయికలుగా నటిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌పై డాక్టర్ జయంతిలాల్ గదా సమర్పిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించా రు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టినరోజు సం దర్భంగా మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు.

 

నేచురల్ స్టార్ నాని ఫస్ట్ సింగిల్ ఓ వెన్నె ల సాంగ్ లాంచ్ చేశారు. శ్రీచరణ్ పాకాల వైబ్రెం ట్ ఎనర్జిటిక్ మెలోడీని కంపోజ్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రగ్గడ్ రస్టిక్ అవతార్‌లో క నిపించారు. లుంగీ ధరించి ఎనర్జిటిక్ మాస్ డ్యా న్స్ మూమెంట్స్‌తో అలరించారు. వెన్నెల పాత్రలో అదితి పల్లెటూరి అమ్మాయిగా ఆకట్టుకుంది. ఇద్ద రి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. అనురాగ్ కులకర్ణి, యామిని ఘంటసాల పూర్తి ఎనర్జీతో పాడారు. తిరుపతి జవాను రాసిన లిరిక్స్ బెల్లంకొండ పాత్రలోని ఎమోషన్స్‌ని, వెన్నెల పట్ల తనకున్న ప్రేమను అందంగా చూపించాయి. ఈ బ్యూటీఫుల్ మెలోడీకి అద్భుతమైన స్పందన వస్తోంది.

అడ్వెంచర్ అవతార్‌లో…

యాక్షన్- హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘బిఎస్‌ఎస్12’ 35 శాతం షూటిం గ్ పూర్తి చేసుకుంది. డెబ్యుటెంట్ లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మూన్‌షైన్ పి క్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు నిర్మిస్తున్నారు. శి వన్ రామకృష్ణ సమర్పిస్తున్న ఈ సినిమా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లో హయ్యస్ట్ బడ్జెట్ మూవీ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అతని క్యారెక్టర్ పోస్టర్‌ను రి లీజ్ చేశారు, అతన్ని అడ్వెంచర్ అవతార్‌లో చూ పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News