Tuesday, January 21, 2025

గొప్ప కథాబలం ఉన్న సినిమా భైరవం

- Advertisement -
- Advertisement -

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం ఫస్ట్-లుక్ పోస్టర్‌లు, చార్ట్‌బస్టర్ ఫస్ట్ సింగిల్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌పై డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సోమవారం ఈ మూవీ టీజర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. ఈ ఈ వెంట్‌లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మా ట్లాడుతూ “ఈ సినిమాకి డైరెక్టర్ విజయ్ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ సినిమాని రోహిత్ ఒప్పుకోవడం మోస్ట్ హ్యాపీ మూమెంట్.

ఈ కథకు రోహి త్, మనోజ్ తప్పితే ఎవరు చేయలేరనే అంతా గొప్పగా చేశారు. ఈ సినిమా అందరికీ మంచి పేరు తీసుకొచ్చి మమ్మల్ని మరో మెట్టు పైకి తీ సుకెళ్తుందని కోరుకుంటున్నాను. గొప్ప కథాబలం వున్న సినిమా ఇది”అని అన్నారు. హీ రో మనోజ్ మంచు మాట్లాడుతూ “విజయ్ ఈ కథ చెప్పిన వెంటనే నాకు చాలా నచ్చింది. ఇందు లో నా బ్రదర్ రోహిత్, సాయి ఉన్నారని చెప్తే ఇంకా ఆసక్తిగా అనిపించి వెంటనే ఒప్పుకున్నాను. డైరెక్టర్ విజయ్ చాలా అంకితభావంతో ఈ సినిమాని తీశారు. ఇది కేవలం టీజర్ మాత్రమే. ట్రైలర్ అదిరిపోతుంది. సినిమా దుమ్ము లేచిపోతుంది”అని తెలిపారు. హీరో నారా రోహిత్ మాట్లాడుతూ “ఇది నాకు మోస్ట్ మెమరబుల్ ఫిలిం. ఈ సినిమా విజయం సాధించి విజయ్ మరెన్నో పెద్ద సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను”అని తెలియజేశారు. డైరెక్టర్ విజయ్ కనకమేడల మా ట్లాడుతూ “నాంది సినిమా చూసినప్పుడు ఎంత థ్రిల్ ఫీల్ అయ్యారో భైరవం చూసినప్పుడు కూడా అంతే థ్రిల్, ఎమోషన్ ఫీల్ అవుతారు.

నాందికి ఎంత పేరు వచ్చిందో ఈ సినిమాతో నాకు అంతకంటే మంచి పేరు వస్తుంది”అని పేర్కొన్నారు. నిర్మాత కేకే రాధా మోహన్ మాట్లాడుతూ “ముగ్గురు హీరోలు అనేసరికి నాకు, మా డైరెక్టర్‌కి కొంచెం టెన్షన్ వచ్చింది. అయితే మాకు ఎలాంటి టెన్షన్ ఇవ్వకుండా ఒక ముగ్గురు బ్రదర్స్‌లాగా పనిచేయడంతో అనుకున్న సమయంలో సినిమాని పూర్తి చేయగలిగాం. ఈ సినిమా కచ్ఛితంగా విజయం సాధిస్తుంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ అతిధి శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల, కో ప్రొడ్యూసర్ శ్రీధర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News