Monday, January 20, 2025

కొత్త ఎమ్మెల్యేకు సిఎం పీఠం… రాజస్థాన్‌లో బిజెపి ఛమక్

- Advertisement -
- Advertisement -

కొత్త ఎమ్మెల్యేకు సిఎం పీఠం
సభాపక్ష నేతగా భజన్‌లాల్ శర్మ
వసుంధరా రాజే ప్రతిపాదన
ఎమ్మెల్యేలతో ఏకగీవ్ర ఎన్నిక
రాజ్‌నాథ్ సమక్షంలో ప్రక్రియ

జైపూర్ : రాజస్థాన్ ముఖ్యమంత్రి పీఠానికి బిజెపి తరఫున భజన్ లాల్ శర్మ ఎంపికయ్యారు. బిజెపిలో పలువురు దిగ్గజ నేతలను కాదని తొలిసారి ఎమ్మెల్యే అయిన శర్మను ఈ అత్యున్నత పదవికి ఎన్నుకున్నారు. రాజస్థాన్ బిజెపి శాసనసభాపక్షం సమావేశం మంగళవారం జరిగింది. ముగ్గురు పార్టీ కేంద్ర పరిశీలకులు సమక్షంలో శాసనసభా పక్ష నేత ఎన్నిక జరిగింది. శర్మను ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తరువాత భజన్‌లాల్ శర్మ శాసనసభా పక్ష నేతగా ఎంపిక అయిన విషయాన్ని పరిశీలకులుగా వచ్చిన బిజెపి సీనియర్ నేత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విలేకరులకు తెలిపారు.

115 మంది ఎమ్మెల్యేలు హాజరయిన లెజిస్లేచర్ పార్టీకి పరిశీలకులుగా వినోద్ తావ్డే, సరోజ్‌పాండేలు కూడా వ్యవహరించారు. బిజెపి నేతలు దీనితో రాజస్థాన్ అధికార పీఠంపై సాగుతోన్న ఉత్కంఠ వీడింది. సంగనేర్ నుంచి ఎమ్మెల్యేగా తొలి పోరులోనే ఎన్నియిన శర్మ వయస్సు 56 సంవత్సరాలు. సమావేశంలో పార్టీ శాసనసభా పక్ష నేతగా శర్మ పేరును వసుంధరా రాజే స్వయంగా ప్రతిపాదించారు. ఈ పదవికి ఆమె కీలక పందెందారుగా ప్రచారం జరిగింది. పలు సమీకరణల నేపథ్యంలో కొత్త వ్యక్తికి ఈ సారి సిఎం పదవిని ఇచ్చేందుకు బిజెపి అధినాయకత్వం నిర్ణయించిందని పరిణామాలతో వెల్లడైంది.

ఉపముఖ్యమంత్రులుగా రాజవంశానికి చెందిన దియా కుమారి , ప్రేమ్‌చంద్ బైర్వా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను ఓడించి బిజెపి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పవర్‌లోకి వచ్చింది. అప్పటి నుంచి మాజీ సిఎం వసుంధరా రాజే ప్రధాన బిందువుగా తదుపరి సిఎం విషయంపై రాజకీయాలు సాగాయి. రాజేనే తదుపరి సిఎం అవుతారని ఆశించారు. కానీ ఇందుకు విరుద్ధంగా జరిగింది. ఇది ఆకస్మిక పరిణామం అయింది.

భరత్‌పూర్ జిల్లా వాసి, ఆర్‌ఎస్‌ఎస్ మద్దతువాలా
ఇప్పుడు అత్యంత విచిత్ర రీతిలో సిఎం పదవి వరిస్తోన్న శర్మ రాష్ట్రంలోని భరత్‌పూర్ జిల్లా వాసి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) మద్దతు పూర్తిగా సంతరించుకున్నారు. ఈ ఎన్నికలలో ఆయన 48వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు శర్మ బిజెపి రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. లెజిస్లేచర్ పార్టీ భేటీకి ముందు పార్టీ ఎమ్మెల్యేలు అంతా కలిసి దిగిన గ్రూప్ ఫోటోలో శర్మ చివరి వరుసలో అప్రాధాన్యతగా నిలిచి ఉన్నారు. కానీ భేటీలో శర్మ పేరు ప్రతిపాదించడం, ఆయన నేతగా ఎన్నిక కావడం క్షణాలలో జరిగాయి. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిణి కానున్న దియాకుమారి జైపూర్ రాజకుటుంబ వారసురాలు. రెండుసార్లు ఎమ్మెల్యే.

ఓసారి ఎంపి అయిన ఘనత ఉంది. గతంలో జైపూర్ రాజవంశ వారసులు అయిన భవానీ సింగ్ కూతురు అయిన దియాకుమారి ఇప్పుడు రాజకీయంగా అధికార పీఠం దక్కించుకున్నారు. భవానీ సింగ్ 1971 భారత్ పాకిస్థాన్ యుద్ధ సమయంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో సైన్యానికి సేవలు అందించారు. 10వ పారాచూట్ రెజిమెంట్‌లోని పారా కమెండో దళాధిసతిగా వ్యవహరించారు. దళిత ముఖచిత్రంగా ప్రేమ్‌చంద్ బైర్వాను బిజెపి ఎంపిక చేసుకుని , ఉపముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. 54 సంవత్సరాల బైర్వా ఈ ఎన్నికలలో దూద్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయ్యారు. జైపూర్‌లోని యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి పిహెచ్‌డి చేసిన బైర్వా ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో భారీ మెజార్టీతోనే విజయం సంతరించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News