Monday, January 20, 2025

శ్రీవిష్ణు పక్కింటి కుర్రాడిలా ఉంటాడు

- Advertisement -
- Advertisement -

శ్రీవిష్ణు, క్యాథరిన్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం భళా తందనాన. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో దర్శకులు రాజమౌళి, శేఖర్ కమ్ముల ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ “దర్శకుడు చైతన్య ఈ సినిమా ప్రతి మూమెంట్‌లోనూ తర్వాత ఏం జరుగుతుందనే సస్పెన్స్ క్రియేట్ చేశాడు. హీరో శ్రీవిష్ణు పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. చేప నీటిలోకి సులభంగా వెళ్లినట్లు తను కూడా మాస్ పాత్రలోకి వెళ్లిపోతాడు. మంచి భవిష్యత్తు కనిపిస్తున్న హీరోల్లో శ్రీవిష్ణు ఒకడు”అని అన్నారు. చిత్ర దర్శకుడు చైతన్య దంతులూరి మాట్లాడుతూ “సినిమాకు నాలుగు కీలక భాగాలైనా రైటింగ్, షూటింగ్, ఎడిటింగ్, సౌండ్ చక్కగా కుదిరాయి. మణిశర్మ మంచి ట్యూన్స్ ఇచ్చారు. సినిమాలో శ్రీవిష్ణు పాత్ర సరికొత్తగా ఉంటుంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీవిష్ణు, క్యాథరిన్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News