Monday, December 23, 2024

మే 6న ‘భళా తందనాన’

- Advertisement -
- Advertisement -

'Bhala Thandanana' release on May 6

 

యంగ్ హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం ‘భళా తందనాన’. చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కొత్త విడుదల తేదీ ఖరారైంది. వైవిధ్యమైన కధాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మొదటి రెండు లిరికల్ వీడియోకు మంచి స్పందన లభించింది. ఈ చిత్రం టీజర్ అన్నివర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని సినిమాపై అంచనాలు పెంచింది. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కేథరిన్ కథానాయికగా నటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News