Friday, December 27, 2024

సిరుత పులుల సిందాటా…

- Advertisement -
- Advertisement -

Bhale bhale banjara song released

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సిద్ధ అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. మెగా తండ్రీ కొడుకులు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి ఒక సాంగ్‌లో స్టెప్పులేశారు. వీరిద్దరూ డ్యాన్స్ చేసిన ‘భలే భలే బంజారా…’ అనే సాంగ్ లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా చిరంజీవి ట్వీట్ చేస్తూ.. “నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాట ఇది. ‘భలే భలే బంజారా’ కోసం నా ఎనర్జిటిక్ రామ్‌చరణ్ తో కలిసి కాలు కదపడం ఎంతో సంతోషంగా ఉంది”అని పేర్కొన్నారు. “నిస్సందేహంగా ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాట. మా నాన్న… నా ఆచార్య చిరంజీవితో కలిసి డ్యాన్స్ చేయడంలోని ఆనందాన్ని, గౌరవాన్ని మాటల్లో చెప్పలేను” అని మెగా తనయుడు రామ్‌చరణ్ ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు.

ఇప్పటికే రిలీజ్ చేయబడిన ‘భలే భలే బంజారా’ పాట ప్రోమోకు మంచి స్పందన లభించింది. ఇప్పుడు ‘హే సింబా రింబా.. సింబా రింబా.. సిరుతా పులుల సిందాటా.. సరదా పులుల సయ్యాటా..’ అంటూ వచ్చిన ఫుల్ సాంగ్ శ్రోతలను అలరిస్తోంది. ఇందులో చిరంజీవి, – రామ్‌చరణ్ ఒకరితో ఒకరు పోటీపడి మరీ గ్రేస్‌ఫుల్ డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. ఈ పాటకు మణిశర్మ సంగీతం సమకూర్చగా.. గేయ రచయిత రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్… యువ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి ఈ గీతాన్ని ఆలపించారు. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఆచార్య’ సినిమా సమ్మర్ కానుకగా ఈనెల 29న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News