- Advertisement -
ముంబయి: మహారాష్ట్రలోని భండారా జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. జవహర్ నగర్ లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరగడంతో పలువురు మృతి చెందారు. పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ పైకప్పు కూలిపోయింది. పేలుడు శబ్ధం ఐదు కిలో మీటర్ల వరకు వినిపించిందని స్థానికులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో 14 మంది సిబ్బంది పని చేస్తున్నారని కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. పోలీసులు, ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలుచేపట్టారు. ఇప్పటివరకు ఒకరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇద్దరిని కాపాడినట్టు సమాచారం ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -